DCW Chief : రేపిస్టులు..డేరా బాబాపై చర్యలు తీసుకోండి
ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్
DCW Chief : ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చైర్ పర్సన్ స్వాతి మలివాల్ నిప్పులు చెరిగారు. దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన గుజరాత్ రాష్ట్రానికి చెందిన బిల్కిస్ బానో అత్యాచారం, హత్య కేసులో జీవిత ఖైదుకు లోనైన 11 మంది రేపిస్టులను విడుదల చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు స్వాతి మలివాల్.
ఇదే సమయంలో హర్యానాకు చెందిన డేరా బాబాకు పెరోల్ ఇవ్వడంపై మండిపడ్డారు. ఈ దేశంలో అసలు ప్రజాస్వామ్యం అన్నది ఉందా అని ప్రశ్నించారు స్వాతి మలివాల్(DCW Chief) . ఈ మేరకు ఆమె సుదీర్ఘమైన లేఖ రాశారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి(PM Modi). ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మీరు ఇలాంటి దారుణాలకు ఎలా మద్దతు పలుకుతారంటూ ప్రశ్నించారు.
గుజరాత్, హర్యానాలో కొలువు తీరిన ప్రభుత్వాలు మీ పార్టీకి చెందినవే కావడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. బిల్కిస్ బానో కేసులో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడం, ఇక తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న డేరా బాబాకు పెరోల్ ఇవ్వడం ఎంత వరకు సబబు అని నిలదీశారు. వారిని వెంటనే జైలుకు పంపాలని కోరారు.
ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని సూచించారు. రేప్ కు పాల్పడిన వారిలో మార్పు వస్తుందని ఎలా అనుకోగలమని పేర్కొన్నారు స్వాతి మలివాల్. ప్రస్తుతం చట్టాలలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని నేరస్తులు సులభంగా జైలు నుంచి విడుదల అవుతున్నారని వాటిని మార్చాల్సిన అవసరం ఉందన్నారు.
కఠిన చట్టాలు ఏర్పాటు చేస్తే నేరస్థులు, దోషులు బయటకు రాలేరని స్పష్టం చేశారు.
Also Read : ట్విట్టర్ యూజర్లకు ఎలాన్ మస్క్ ఖుష్ కబర్