#AlmondMilk : బాదంపాలు ఉపయోగాలు
బాదంపాలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది.
AlmondMilk : బాదం మన ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు బాదంపాలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. బాదాంపాలు పడుకునే ముందు తాగితే మరిన్ని ప్రయోజనాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఎదిగే పిల్లలకు బాదంపాలు ఇవ్వడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. బాదాంపాలలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
బాదంపాలులో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతాయి. బాదంపాలు త్రాగడం వల్ల మెదడకు కావల్సిన శక్తి లభిస్తుంది. వ్యాధినిరోధకతను పెంచుతుంది. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనతను రాకుండా కాపాడుతుంది. బాదంపాలలో ఉండే పీచు, ప్రొటీన్లు, కాలరీలు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సాయపడతాయి.
మలబద్దకం సమస్యతో బాధపడేవారు బాదాం పాలు తరచు తీసుకుంటే ఈ సమస్య నుండి బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. బాదంపాలు తరచూ తాగడం వల్ల శరీరానికి అవసరమయ్యే ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. అంతేకాదు లైంగిక సమస్యలను కూడా దూరం చేస్తుంది. కండరాల పెరుగుదలకు మరియు కండరాలు బలోపేతం చేయడానికి అద్భుతంగా సహాయపడుతాయి.
No comment allowed please