TFPC : పండుగల వేళ తెలుగు సినిమాలకే ప్రయారిటీ
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి నిర్ణయం
TFPC : తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు డబ్బింగ్ సినిమాలకు చెక్ పెడుతూ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు వారికి సంబంధించి పండుగల సమయంలో కేవలం తెలుగులో స్ట్రెయిట్ గా నిర్మించినా లేదా తీసిన సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది.
ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దసరా, సంక్రాంతి ఫెస్టివల్స్ రాబోతున్నాయి. ఈ సందర్భంగా నేరుగా తెలుగు మూవీస్ కు మాత్రమే ఎగ్జిబిషన్ భాగస్వాములు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది నిర్మాతల మండలి. అడ్డగోలుగుగా నిర్మాణ వ్యయం పెరిగిందని ఈ కారణంగా డబ్బింగ్ సినిమాలు కూడా వచ్చి చేరితో తెలుగులో నేరుగా తీసిన సినిమాలకు ఆదరణ ఉండడం లేదని అభిప్రాయపడింది.
ఇదే సమయంలో నిర్మాతల సంక్షేమం, తెలుగు చలన చిత్ర పరిశ్రమకు(TFPC) నష్టం రాకుండా ఉండేందుకు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుందని తెలిపింది. ఇవాళ అత్యవసర సమావేశం నిర్వహించిందని ఇందులో తీర్మానం చేయడం జరిగిందని పేర్కొంది.
ఈ కీలక ప్రకటనకు సంబంధించి అధికారికంగా ఓ నోట్ విడుదల చేసింది. సంక్రాంతి, దసరా పండుగల్లో తెలుగు స్ట్రెయిట్ సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది.
దీనికి సంబంధించి ప్రముఖ నిర్మాత , ప్రస్తుత తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి వైస్ ప్రెసిడెంట్ దిల్ రాజు డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు ఎలా ఇవ్వగలమంటూ ప్రశ్నించారు. మొదటగా తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఉంటుందని, ఆ తర్వాత డబ్బింగ్ సినిమాలకు ఛాన్స్ ఇవ్వడం జరుగుతుందని టీఎఫ్పీసీ వెల్లడించింది.
Also Read : అయేషాతో రొమాన్స్ సానియాకు నో ఛాన్స్