IPL Auction 2023 : ఐపీఎల్ వేలంలో ఆ ఆట‌గాళ్ల‌కే డిమాండ్

23న కొచ్చిలో ప్రారంభం కానున్న వేలం పాట

IPL Auction 2023 : అంతా ఎంతో ఉత్కంఠ‌త‌తో ఎదురు చూస్తున్న క్ష‌ణాలు రానే వచ్చాయి. వ‌చ్చే ఏడాది 2023లో భార‌త్ లో నిర్వ‌హించే ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) మెగా టోర్నీకి సంబంధించి ముంద‌స్తు వేలం పాట‌కు సిద్ద‌మైంది బీసీసీఐ. ఈ మేర‌కు ఐపీఎల్ ప్యాన‌ల్ క‌మిటీ టోర్నీలో పాల్గొనే ఆట‌గాళ్ల‌ను వేలం పాట(IPL Auction 2023) చేప‌ట్ట‌నుంది.

ఇందుకు వేదిక కూడా ఖ‌రారు చేసింది. గ‌తంలో బెంగ‌ళూరు వేదిక‌గా వేలం జ‌రిగితే ఈసారి కేర‌ళ‌ల‌లోని కొచ్చి న‌గ‌రాన్ని ఎంపిక చేశారు. ఇప్ప‌టికే పాల్గొనే 10 జ‌ట్ల ఫ్రాంచైజీలు త‌మ రిటైన్ , ఆట‌గాళ్ల జాబితాను ఐపీఎల్ క‌మిటీకి అందజేశాయి. కొన్ని ఫ్రాంచైజీలు 13 మందిని వ‌దులుకున్నాయి. ముంబై ఇండియ‌న్స్ , సీఎస్కే, ల‌క్నో జియంట్స్ , రాజ‌స్తాన్ రాయ‌ల్స్ , పంజాబ్ కింగ్స్ , ఢిల్లీ డేవిల్స్ , రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, కోల్ క‌తా నైట్ రైడెర్స్, గుజ‌రాత్ టైటాన్స్ , స‌న్ రైజ‌ర్స్ ఆఫ్ హైద‌రాబాద్ ఉన్నాయి.

ఈ ఏడాది జ‌రిగిన ఐపీఎల్ లో కోల్ క‌తా టైటాన్స్ , రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఫైన‌ల్ లో పోటీ ప‌డ్డాయి. మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు వేలం పాట జ‌ర‌గ‌నుంది. ఇందుకు సంబంధించి ఐపీఎల్ వేలం పాట‌కు సంబంధించిన జాబితాను ప్ర‌కటించింది బీసీసీఐ. వేలం పాట‌లో 991 మంది ఆట‌గాళ్లు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

వీరిలో కేవ‌లం 405 మంది ఆట‌గాళ్ల‌కు మాత్ర‌మే ఛాన్స్ దొరికింది. ఇందులో 273 మంది ఇండియ‌న్స్ కాగా 132 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇక క్యాప్డ్ ప్లేయ‌ర్లు 119 మంది ఉంటే అన్ క్యాప్ లో 282 మంది ఆట‌గాళ్లు ఉన్నారు.

Also Read : ఇది అర్జెంటీనా ప్ర‌జ‌ల విజ‌యం – మెస్సీ

Leave A Reply

Your Email Id will not be published!