Jacqueline Fernandez : బయటకు వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వండి
ఢిల్లీ కోర్టులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పిటిషన్
Jacqueline Fernandez : ప్రముఖ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. ఆమె కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి విచారణ ఎదుర్కొంటోంది. ఇప్పటికే పలుమార్లు కోర్టును ఆశ్రయించింది. విచారణకు సంబంధించి ఈడీ పలుమార్లు సమన్లు జారీ చేసిన ఫెర్నాండెజ్ ను తొలిసారిగా ఛార్జిషీట్ లో నిందితురాలిగా చేర్చబడ్డారు.
ఇదిలా ఉండగా తన కుటుంబ సభ్యులు బహ్రెయిన్ లో ఉన్నారని, వారిని కలవాల్సి ఉందని అందుకే తనను ఆ దేశానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఆమె దాఖలు చేసిన దావాపై ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నుంచి స్పందన కోరింది.
అడిషనల్ సెషన్స్ జడ్జి శైలేంద్ర మాలిక్ ఏజెన్సీని సమాధానం కోరుతూ డిసెంబర్ 22కి వాయిదా వేశారు. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈనెల 23న తాను బహ్రెయిన్ కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరింది.
ఇదిలా ఉండగా శ్రీలంక జాతీయురాలు నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacqueline Fernandez). సుకేష్ చంద్రశేఖరన్ ప్రధాన నిందితుడిగా కొనసాగుతున్న మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ నిందితుల్లో ఒకరిగా ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు నటిని. ఈ అభియోగంపై జనవరి 6న చంద్రశేకర్ తరపున కోర్టు వాదనలు విననుంది.
న్యాయమూర్తి ఆగస్టు 31న ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకున్నారు. కోర్టు ముందు హాజరు కావాలని ఫెర్నాండెజ్ ను కోరారు.
Also Read : స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ పై అనుష్క ఫైర్