Byjus Layoffs : బైజూస్ లో భారీగా ఉద్యోగుల తొలగింపు
రెండవసారి 1,000 మందిపై వేటు
Byjus Layoffs : భారతీయ కంపెనీ బైజూస్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. రెండోసారి భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించింది. శుక్రవారం 1,000 మందిపై వేటు వేసింది బైజూస్. 300 మంది మేనేజ్ మెంట్ విభాగంలో పింక్ స్లిప్ పొందారు. గత ఆరు నెలల లోపులో మరోసారి ఉద్యోగులను తొలగించింది. బైజూస్(Byjus Layoffs) సంస్థలోని డిజైన్ , ప్రొడక్షన్ , ఇంజనీరింగ్ విభాగాల నుండి ఉద్యోగులను తగ్గించడం ప్రభావితం చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రభావం కారణంగా ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ రంగాలను భారీగా కుదుపునకు గురి చేసింది. మార్చి 2023 నాటికి లాభదాయకంగా మారాలనే తపనతో కంపెనీ 2,500 మంది కార్మికులను తొలగించిన కొద్ది నెలల తర్వాత బైజూ తీసుకున్న నిర్ణయం భారీ షాక్ కు గురి చేసింది. గత ఏడాది అక్టోబర్ నెలలో తన మార్కెటింగ్ ,కార్యాచరణ ఖర్చును తగ్గించాలని చూస్తున్నట్లు ప్రకటించింది.
దీని వల్ల మొత్తం వర్క్ ఫోర్స్ లో 5 శాతం తగ్గించింది. బ్రాండ్ అవగాహనను పెంపొందించడంపై కంపెనీ ఫోకస్ సారిస్తుందని , రాబోయే నెలల్లో 10,000 మందిని నియమించు కోనున్నట్లు బైజూ కో ఫౌండర్ దివ్య గోకుల్ నాథ్ వెల్లడించారు. బైజూస్(Byjus Layoffs) విలువ $22 బిలియన్లు, ప్రస్తుతం ప్రపంచం లోనే అత్యంత విలువైన ఎడ్యూక్ట్ స్టార్టప్ . దీనిని 2015 లో స్థాపించారు బైజూస్ ను. బెంగళూరు లో ప్రధాన కార్యాలయం ఉంది .
బైజూస్ తన ట్యూటరింగ్ వ్యాపారం అయిన ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ $1 బిలియన్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ కోసం ప్లాన్ ను ఖరారు చేస్తోంది. 2021లో సేకరించిన $1.2 బిలియన్ల రుణాన్ని తిరిగి పని పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తోంది.
Also Read : విత్త’ మంత్రి వింత కామెంట్స్