Nirmala Sitharaman : ‘విత్త’ మంత్రి వింత కామెంట్స్

అంతా బాగానే ఉంద‌న్న నిర్మ‌ల

Nirmala Sitharaman : ఓ వైపు భార‌తీయ వ్యాపార వేత్త గౌతం అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు ఆవిరై పోతుంటే ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మాత్రం భార‌తీయ మార్కెట్ బాగానే ఉందంటోంది. ఈ మొత్తం వ్య‌వ‌హారానికి పూర్తిగా మ‌ద్ద‌తు ప‌లికింది ఎవ‌రో ఆమెకు తెలియ‌ద‌ని అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే. ప్ర‌భుత్వ ఆస్తుల‌ను గంప గుత్త‌గా అమ్మ‌కానికి లేదా లీజుకో ఇస్తూ వ‌చ్చిన మోదీ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం ఉన్న‌ట్టుండి త‌న స్వ‌రం మార్చుకుంది.

ఈ దేశాన్ని అదానీ, అంబానీ, టాటాల‌కు అప్ప‌గిస్తున్నారంటూ మ‌హా ప్ర‌భో అని నెత్తీ నోరు బాదుకుంటూ వ‌చ్చారు కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ. ఆయ‌న‌ను బీజేపీ , దాని అనుబంధ సంస్థ‌లు పప్పు అంటూ ఎద్దేవా చేశాయి. ఇవాళ ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌లో టాప్ లో ఉన్న జీవిత బీమా సంస్థ , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన డ‌బ్బుల‌ను అదానీ గ్రూప్ లో భారీగా పెట్టుబ‌డి పెట్టేలా ప్రోత్స‌హించింది కేంద్ర స‌ర్కార్ కాగా దాని గురించి ఊసెత్త‌డం లేదు నిర్మ‌ల‌మ్మ‌.

తాజాగా ప్ర‌తిప‌క్షాలు పెద్ద ఎత్తున ధ్వ‌జ‌మెత్తాయి. వెంట‌నే సుప్రీంకోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో అదానీ గ్రూప్ వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశాయి. ఈ త‌రుణంలో స్పందించిన విత్త మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్(Nirmala Sitharaman) మాత్రం ప్ర‌పంచ మార్కెట్ లో ఒడిదుడుకులు ఏర్ప‌డినా భార‌త మార్కెట్ స్థిరంగానే ఉంద‌ని చెప్పింది. అంటే ఇంకా అదానీని వెన‌కేసుకుని వ‌స్తున్న‌ట్టా అనేది తేలాల్సి ఉంది.

Also Read : ఆవిర‌వుతున్న సంప‌ద‌తో ఆగ‌మాగం

Leave A Reply

Your Email Id will not be published!