IND vs AUS 2023 Tour : ఆసిస్ తో భారత్ అమీ తుమీకి రెడీ
టెస్టు, వన్డే సీరీస్ కు జట్లు సిద్దం
IND vs AUS 2023 Tour : కొత్త ఏడాది 2023లో వరుస విజయాలతో దూసుకు పోతోంది భారత జట్టు. మూడు ఫార్మాట్ లు వన్డే, టెస్టు, టీ20లలో దుమ్ము రేపుతోంది. స్వదేశంలో జరిగిన శ్రీలంక, న్యూజిలాండ్ జట్లతో జరిగిన సీరీస్ లు భారత్ వశమయ్యాయి. ఊహించని గెలుపులతో జోరు మీదుంది. ఈ తరుణంలో మరో టెస్టు, వన్డే సీరీస్ కు సిద్దమైంది టీమిండియా. ఇందుకు సంబంధించి ఇప్పటికే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ జట్లను ప్రకటించింది.
భారత్, ఆస్ట్రేలియా జట్లకు(IND vs AUS 2023 Tour) సంబంధించి టూర్ షెడ్యూల్ ను ఖరారు చేసింది. ఇరు జట్లు అన్ని ఫార్మాట్ లలో బలంగా ఉన్నాయి. మొత్తంగా అసలైన పోరాటానికి సిద్దమవుతున్నాయి.
ప్రాక్టీస్ లో మునిగి పోయారు ఇరు జట్ల ఆటగాళ్లు. ఇదిలా ఉండగా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి భారత్ , ఆస్ట్రేలియా జట్లు. ఫైనల్ కు చేరాలంటే ఇరు జట్లకు ఈ సీరీస్ కీలకం.
టూర్ లో భాగంగా ఆస్ట్రేలియా నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు మొదటి టెస్టు నాగ్ పూర్ లో జరగనుంది. రెండో టెస్టు 17 నుంచి 21 వరకు ఢిల్లీ లో, మూడో టెస్టు మార్చి 1 నుంచి 5 వరకు ధర్మశాలలో , మార్చి 9 నుంచి 13 వరకు నాలుగో టెస్టు వాంఖడే స్టేడియలో జరుగుతుంది.
ఇక వన్డే సీరీస్ లో భాగంగా మార్చి 17న వాంఖటే మైదానంలో తొలి వన్డే జరుగుతుంది. రెండో వన్డే మార్చి 19న విశాఖపట్టణంలో , మార్చి 22న చెన్నై వేదికగా మూడో వన్డే జరగనుంది.
Also Read : ఇంటి వాడైన పాక్ స్టార్ పేసర్