Vinod Kambli Case File : మాజీ క్రికెటర్ కాంబ్లీపై భార్య ఫిర్యాదు
తాగొచ్చి కొడుతున్నాడంటూ ఆవేదన
Vinod Kambli Case File : మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీపై కేసు నమోదైంది. ఆయనపై భార్య సంచలన ఆరోపణలు చేసింది. తాగి వచ్చి తనను ఇష్టానుసారంగా కొడుతున్నాడంటూ , తనకు రక్షణ లేకుండా పోయిందంటూ వాపోయింది. వంటకు సంబంధించి వాడే పాన్ (గరిటె)తో తనను బలంగా కొట్టాడంటూ ఆరోపించింది. ఈ విషయం గురించి భార్య ఆండ్రియా స్వయంగా బాంద్రా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది.
వినోద్ కాంబ్లీకి ఇదే మొదటిసారి కాదు..గతంలో కూడా వార్తల్లో ఉంటూ వచ్చారు. హౌసింగ్ సొసైటీ గేటులోకి దూసుకు వెళ్లాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు గతంలో. భార్య ఆండ్రియా ఫిర్యాదు మేరకు వినోద్ కాంబ్లీపై(Vinod Kambli Case File) బాంద్రా పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో తనను దూషించాడని, ఆపై కొట్టాడంటూ కన్నీటి పర్యంతమైంది ఆండ్రియా. ముంబై పోలీసులు ఐపీసీ 324, 04 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
కాగా ఇంకా కాంబ్లీని అదుపులోకి తీసుకోలేదు. గరిటెతో కొట్టడంతో గాయమైందని, తమ 12 ఏళ్ల కొడుకును కూడా కొట్టేందుకు ప్రయత్నం చేశాడని ఆరోపించింది ఆండ్రియా. ఇదిలా ఉండగా వినోద్ కాంబ్లీ 2014లో బాంద్రా లోని ఎస్టీ పీటర్స్ చర్చిలో ఆండ్రియా హెవిట్ ను వివాహం చేసుకున్నారు. గత ఏడాది కాంబ్లీ ఉద్యోగం కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్ ను సంప్రదించాడు.
జాబ్ ఇస్తే తాగడం మానేస్తానని తెలిపాడు. మొదటి సారి తన కుటుంబం గురించి మాట్లాడాడు. బీసీసీఐ నుండి నెల నెలా అందుతున్న రూ. 30 వేల పెన్షన్ తో జీవిస్తున్నట్లు చెప్పాడు వినోద్ కాంబ్లీ.
Also Read : పాకిస్తాన్ క్రికెటర్లకు ఐసీసీ ఝలక్