Javed Miandad : ఐసీసీపై మియందాద్ సీరియ‌స్

బీసీసీఐ ఐసీసీలో లేదా అని నిల‌దీత

Javed Miandad : పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ జావేద్ మియందాద్(Javed Miandad) షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయ‌న ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పై నిప్పులు చెరిగాడు. ప్ర‌స్తుతం ఆసియా క‌ప్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే భ‌ద్ర‌తా కార‌ణాల రీత్యా భార‌త్ జ‌ట్టు పాకిస్తాన్ లో ఆడే ప్ర‌స‌క్తి లేద‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది బీసీసీఐ.

ఇదే విష‌యాన్ని ప్రెసిడెంట్ బిన్నీ, కార్య‌ద‌ర్శి జే షా ప్ర‌క‌టించారు. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ న‌జామ్ సేథీ. పూర్తిగా ఏక‌పక్షంగా నిర్ణ‌యం తీసుకున్నారంటూ ఆరోపించారు. ఇదిలా ఉండ‌గా మాజీ పీసీబీ చైర్మ‌న్ ర‌మీజ్ ర‌జా సైతం భార‌త్ గ‌నుక పాకిస్తాన్ లోని ఆసియా క‌ప్ లో ఆడ‌క పోతే తాము భార‌త్ లో జ‌రిగే వ‌న్డే వ‌ర‌ల్డ్ కు దూరంగా ఉంటామ‌ని ప్ర‌కటించాడు. దీనిపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి ఠాకూర్ రియాక్ట్ అయ్యాడు.

ఆడ‌క పోతే వ‌చ్చిన న‌ష్టం ఏమీ లేద‌న్నాడు. మీకే భారీ న‌ష్టం వాటిల్లుతుంద‌న్నాడు. ఇదిలా ఉండ‌గా ఆసియా క‌ప్ ను ఇప్పుడు నిర్వ‌హించే స్థితిలో లేదు పాకిస్తాన్. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టు మిట్టాడుతోంది. ప్ర‌త్యేకించి భ‌ద్ర‌తా కార‌ణాలు ప్ర‌ధానంగా మారాయి. ఇందుకు సంబంధించి న‌జామ్ సేథీ ఏసీసీ చైర్మ‌న్ జే షాతో చర్చ‌లు జ‌రుపుతున్నారు.

త‌ట‌స్థ వేదిక‌పై ఆడేందుకు అభ్యంత‌రం లేద‌ని ప్ర‌క‌టించాడు. ఇదిలా ఉండ‌గా ఈ మొత్తం వ్య‌వ‌హారం పై మియందాద్ మండిప‌డ్డాడు. అస‌లు బీసీసీఐని కంట్రోల్ చేయ‌లేని ఐసీసీ ఉండీ ఏం లాభ‌మ‌ని ప్ర‌శ్నించాడు.

Also Read : రోహిత్ శ‌ర్మ‌కు అగ్ని ప‌రీక్ష

Leave A Reply

Your Email Id will not be published!