Doris Kareva : భారతీయ సంస్కృతి మాయా ప్రపంచం
ఈస్టోనియా కవయిత్రి డోరిస్ కరేవా
Doris Kareva : ప్రముఖ కవయిత్రి ఈస్టోనియాకు చెంందిన డోరిస్ కరేవా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె భారతీయ సంస్కృతి గురించి గొప్పగా చెబుతూనే కీలకమైన కామెంట్స్ చేశారు. భారతీయ సంస్కృతి అనేది ఒక మాయా ప్రపంచమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఎస్టోనియన్ ప్రభుత్వం 2001లో ఎస్టోనియన్ ఆర్డర్ ఆఫ్ ది వైట్ స్టార్ తో సత్కరించింది. కరేవా రూమి , కబీర్ రచనలను ఇంగ్లీష్ నుండి ఎస్టోనియన్ లోకి అనువాదం చేశారు. సూఫీ సంప్రదాయం , ఆధ్యాత్మికత ద్వారా తాను బాగా ప్రభావితం అయ్యానని చెప్పారు.
ఆమె కేవలం 14 ఏళ్ల వయస్సు నుండి రవీంద్ర నాథ్ ఠాగూర్ తో ప్రభావితమయ్యారు. జైపూర్ కల్చరల్ ఫెస్టివల్ లో కరేవా పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి ,సాహిత్యం కూడా మాయా ప్రపంచమే. ఈ దేశం ఎప్పటికీ అంతం లేని సాహసం, సందర్శనలో గొప్ప అనుభూతి కలిగించేలా చేస్తుందన్నారు. కరేవా భారత దేశానికి నాలుగుసార్లు వచ్చారు.
చిన్ననాటి కల నెరవేరిందన్నారు. 2013 నుండి లేదా అంతకు ముందు కూడా .. భారత దేశం ఒక దేశం మాత్రమే కాదు మొత్తం ఖండంలా అనిపిస్తుందన్నారు కరేవా(Doris Kareva). నేను భారత దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించినప్రతిసారి నేను వేర్వేరు వ్యక్తులను కలుస్తాను. ఇది నాకు అంతులేనిసాహసం అని కరేవా పేర్కొన్నారు.
జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు ఇటీవల భారత దేశానికి వచ్చారు కవి , అనువాదకురాలు డోరిక్ కరేవా. కవి, తత్వవేత్త ఉకు మాసింగ్ ద్వారా ఎస్టోనియన్ లోకి టాగర్ కవితలను అనువాదాలు కూడా తనను మంత్రముగ్ధురాలిని చేసిందన్నారు కరేవా. ఇదిలా ఉండగా 2022లో రాజ్ కమల్ ప్రకాశన్ కరేవా(Doris Kareva) కవితా సంకలనాన్ని ప్రచురించింది. ది ఫైర్ దట్ డోస్ నాట్ వర్న్ పేరుతో తేజీ గ్రోవర్ , రుస్తమ్ సింగ్ అనువాదం చేశారు. ఆమె రచనలు 20 కంటే ఎక్కువ భాషల్లోకి అనువాదం చేయబడ్డాయి.
Also Read : రికీ కేజ్ కు మూడోసారి గ్రామీ అవార్డు