Ajay Banga : అజయ్ బంగా నిబద్దతకు నిదర్శనం
నాయకత్వం వహించేందుకు ప్రేరణ
Ajay Banga World Bank CEO : ప్రవాస భారతీయుడు , మాస్టర్ కార్డ్ మాజీ సీఇఓ అజయ్ బంగాకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచాన్ని శాసించే ప్రపంచ బ్యాంకుకు నాయకత్వం వహించేందుకు గాను అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ నామినేట్ చేశారు అజయ్ బంగాను. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, ఆర్థికవేత్తలు ఆయనకు పని పట్ల ఉన్ననిబద్దత గురించి ప్రస్తావించారు. ప్రశంసలతో ముంచెత్తారు. అజయ్ బంగాతో ఫోటోను పంచుకుంటూ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ చీఫ్ జార్జివా కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచ బ్యాంకుకు నాయకత్వం వహించేందుకు ప్రేరణ పొందిన ఎంపిక అని పేర్కొన్నారు. స్థిరమైన అభివృద్దికి , అవసరమైన వారికి సాయం చేసేందుకు అజయ్ బంగా(Ajay Banga World Bank) నిబద్దతను తాను మెచ్చుకుంటున్నానని పేర్కొన్నారు. ఒక రకంగా అమెరికాలో ప్రస్తుతం ప్రవాస భారతీయులదే హవా కొనసాగుతోంది. ప్రపంచ ద్రవ్య నిధి సంస్థ చీఫ్ క్రిస్టిలినా జార్జివాతో సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అగ్ర నాయకులు డేవిడ్ మాల్పాస్ తాను త్వరలోనే తప్పుకుంటానని ప్రకటించారు.
దీంతో ప్రపంచ బ్యాంకు చీఫ్ కీలక పదవి కోసం యుఎస్ చీఫ్ బైడెన్ మాజీ మాస్టర్ కార్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఓ) అజయ్ బంగాను ఆమోదించారు. నాకు చాలా ఏళ్లుగా అజయ్ బంగాతో అనుబంధం ఉంది. వరల్డ్ బ్యాంక్ కు చీఫ్ గా నియమితులయ్యారని తెలిసి సంతోషానికి గురైనట్లు పేర్కొన్నారు ఐఎంఎఫ్ చీఫ్.
అజయ్ బంగా నాయకత్వ నైపుణ్యం , ప్రతిభ, ఆవిష్కరణలపై ఉన్న పట్టు గొప్పదని కితాబు ఇచ్చారు. మాస్టర్ కార్డ్ సిఇఓ మైఖేల్ మీబాచ్ ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ బ్యాంకుకు నాయకత్వం వహించేందుకు బంగా ఒక ప్రేరణాత్మక ఎంపిక అని పేర్కొన్నారు.
Also Read : ఉక్రెయిన్ పై ఓటింగ్ కు భారత్ దూరం