Uppal KVS Jobs : బిగ్ ఛాన్స్ రాత పరీక్ష లేకుండానే జాబ్స్
ఉప్పల్ కేవీఎస్ లో నిరుద్యోగులకు శుభవార్త
Uppal KVS Jobs : ఎలాంటి రాత పరీక్ష లేకుండా జాబ్స్ రావడం ఈమధ్య కష్టమై పోయింది. ప్రస్తుతం అటెండర్, ప్యూన్, చౌకిదార్, వంట చేసే వారి పోస్టులకు కూడా రాత పరీక్ష నిర్వహిస్తున్నారు. లక్షల్లో నిరుద్యోగులు ఉండడంతో పోటీ పెరిగింది. ఒక్క పోస్ట్ కు వేయి మంది పోటీ పడే పరిస్థితి నెలకొంది.
అటు ప్రైవేట్ రంగంలో ఇటు ప్రభుత్వ రంగంలో రాను రాను కొలువుల సంగతి మరిచి పోయేలా చేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. తాజాగా ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఉప్పల్ కేంద్రీయ విద్యాలయంలో జాబ్స్(Uppal KVS Jobs) కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
కేవలం ఇంటర్వ్యూ ద్వారానే వీటిని భర్తీ చేయనున్నారు. ఆయా పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది.
బీఇడీ, డిగ్రీ, బీఈ, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, పీజీ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతో పాటు సీటెట్ అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించింది ఉప్పల్ కేంద్రీయ విద్యాలయం. మార్చి 7 నుంచి 10 వరకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
పీజీటీ, టీజీటీ, పీఆర్టీ, కోచ్ , స్టాఫ్ నర్స్ , ఎడ్యుకేషనల్ కౌన్సెలర్ , స్పెషల్ ఎడ్యూకేటర్ , కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్ పోస్టులు ఉన్నాయి. ఆయా విభాగాలకు
సంబంధించి చూస్తే కెమిస్ట్రీ, మ్యాథ్స్ , హిందీ, కామర్స్ , సోషల్ స్టడీస్ , ఇంగ్లీష్ , సైన్స్ ,సంస్కృతం, మ్యూజిక్ , డ్యాన్స్ , హాకీ, అథ్లెటిక్స్ ,యోగా ట్వైక్వాండో లో ఖాళీలు ఉన్నాయి.
ఇక ఆయా పోస్టులకు సంబంధించి వయో పరిమితి 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్యన ఉండాలి. ఆఫ్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
ఇక ఇంటర్వూ హాజరయ్యాక మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. కేంద్రీయ విద్యాలయం, నెంబర్ 1, ఉప్పల్ , హైదరాబాద్ లో ఉంటుంది. ఉదయం 8.30 గంటల నుంచి ఇంటర్వ్యూలు ఉంటాయని కేంద్రీయ విద్యాలయం తెలిపింది.
Also Read : ఆగస్టు 29,30 లలో గ్రూప్ -2 ఎగ్జామ్