Chitra Gurmani Daga : చిత్ర గుర్నానీ సక్సెస్ కహానీ
సక్సెస్ ఫుల్ ఉమెన్ సిఇఓగా గుర్తింపు
Chitra Gurmani Daga : విజయానికి దగ్గరి దారులు లేవు. ఉన్నదల్లా భిన్నంగా ఆలోచించడం. కష్టపడి పని చేయడం. లక్ష్యాన్ని చేరుకోవడం. పని చేసుకుంటూ పోతే సక్సెస్ అదంతకు అదే వస్తుందని అంటారు గుర్నాని డాగా(Chitra Gurmani Daga). భారత దేశానికి చెందిన ఈమె మోస్ట్ పాపులర్ సిఇఓలలో ఒకరుగా గుర్తింపు పొందారు. ఆమె చేసిన కృషికి కేంద్ర సర్కార్ ఘనంగా సత్కరించింది.
స్వంతంగా స్టార్టప్ ప్రారంభించి వందల కోట్ల టర్నోవర్ సంస్థగా తీర్చిదిద్దడంలో కీలకమైన పాత్ర పోషించారు గుర్నానీ డాగా. ఇప్పుడు ఆమె సృష్టించిన వ్యాపారం ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది. మరికొందరికి నీడను ఇస్తోంది. మహిళా పారిశ్రామికవేత్తగా, విజయవంతమైన వ్యాపారవేత్తగా తనను తాను మల్చుకున్న తీరు ప్రశంసనీయం.
.ప్రయాణ అనుభవాలను బుక్ చేసుకునేందుకు భారత దేశంలో అతి పెద్ద వేదికగా థ్రిల్లోఫిలియా ను మార్చేసింది. దీనికి చిత్రరా గుర్నానీ డాగా కో ఫౌండర్ గా ఉన్నారు. థ్రిల్లోఫిలియాలో సాహస పర్యటనలు, కార్యకలాపాలు, అద్దెలు, బసచేసేందుకు ఆఫ్ బీట్ ప్రదేశాలను అందిస్తుంది.
చిత్ర గుర్నానీ డాగా హైదరాబాద్ లోని ఇండియన్ బిజినెస్ స్కూల్ లో ఎంబీఏ చదివారు. సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంది. ఆ వెంటనే స్టార్టప్ గా థ్రిల్లోఫియాను ప్రారంభించింది. 125 గమ్య స్థానాలలో 12,500 కార్యకలాపాలు, 3 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది. 1.24 మిలియన్ల డాలర్లను పోగు చేసింది. చిత్రా నికర విలువ రూ. 165 కోట్లు.
Also Read : వైద్య రంగంలో ప్రియాంకా రెడ్డి టాప్