Women Entrepreneurs : వ్యాపార‌వేత్త‌లుగా రాణిస్తున్న మ‌హిళ‌లు

భిన్న రంగాల‌లో త‌మ‌దైన ముద్ర‌

Women Entrepreneurs : భార‌త దేశంలో మ‌హిళ‌ల‌కు కొద‌వ లేదు. కానీ వారు ఎంచుకున్న మార్గాలు కూడా భిన్నంగా ఉన్నాయి. ప్ర‌తి రంగంలో కీల‌క‌మైన పాత్ర పోషిస్తూ వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం స్టార్ట‌ప్ హ‌వా కొన‌సాగుతోంది. గ‌త కొంత కాలం నుంచీ వారు త‌మ‌దైన ముద్ర క‌న‌బ‌రుస్తున్నారు. తాము కోరుకున్న క‌ల‌ల్ని సాకారం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. వారిలో లెక్కించ లేనంత మంది ఉన్నారు. త‌మ‌ను తాము తీర్చిదిద్దుకుంటూనే మ‌రికొంద‌రికి స్పూర్తి దాయ‌కంగా నిలుస్తున్నారు.

కేవ‌లం సాంప్ర‌దాయ గృహిణి పాత్ర‌కు మాత్ర‌మే ప‌రిమితమైన వారు నేడు విజ‌య‌వంత‌మైన వ్యాపార‌వేత్త‌లుగా రాణించ‌డం విశేషం. బెంగ‌ళూరు, ముంబై, ఢిల్లీ, హైద‌రాబాద్ లాంటి న‌గ‌రాలు ఇప్పుడు ఔత్సాహిక మ‌హిళ‌ల‌కు వేదిక‌లుగా మారాయి. విధాన రూప‌క‌ర్త‌లుగా, వెంచర్ క్యాపిట‌లిస్టులుగా , మీడియా రంగంలో కీల‌క వ్య‌క్తులుగా, విద్యా వేత్త‌లుగా, టెక్కీలుగా స‌క్సెస్ అయ్యారు.

ఇక నేష‌న‌ల్ శాంపిల్ స‌ర్వే ప్ర‌కారం భార‌త దేశంలో 14 శాతం వ్యాపారాల‌ను మాత్ర‌మే మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌లు(Women Entrepreneurs) నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 126 మిలియ‌న్ల మంది మ‌హిళ‌లు త‌మ సొంత వ్యాపారాన్ని క‌లిగి ఉన్నార‌ని అంచ‌నా. ఇక ప్ర‌పంచంలో జ‌నాభా ప‌రంగా రెండో స్థానంలో ఉన్న‌ప్ప‌టికీ ఇంకా మ‌హిళ‌ల స‌క్సెస్ రేటు ప‌రంగా చూస్తే త‌క్కువ‌గా ఉంది.

వ్య‌క్తిగ‌త పోరాటాలు, స‌వాళ్ల‌తో కూడిన ల‌క్ష్యాల‌ను అధిగ‌మించ‌డంలో త‌మ‌దైన ముద్ర క‌న‌బ‌రుస్తూ ముందుకు సాగుతున్నారు. విధాన రూప‌క‌ర్త‌లుగా ముందంజ‌లో ఉండ‌డం శుభ ప‌రిణామం. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సైతం ప్రోత్స‌హిస్తున్నాయి. వ్యాపార‌వేత్త‌లుగా రాణించేందుకు తోడ్పాటు అంద‌జేస్తున్నాయి. ఏది ఏమైనా మ‌రికొంత రేషియో పెర‌గాల్సిన అవ‌స‌రం ఉంది.

Also Read : మ‌హిళ‌ల పాలిట దేవత అదితి గుప్తా

Leave A Reply

Your Email Id will not be published!