K Raghavendra Rao : గర్వపడాలే తప్పా విమర్శిస్తారా
తమ్మారెడ్డి దర్శకేంద్రుడి కౌంటర్
K Raghavendra Rao : టాలీవుడ్ లో దర్శకుల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. మెగా బ్రదర్ నాగబాబు దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజపై భగ్గుమన్నారు. ఆర్ఆర్ఆర్ పై నోరు పారేసుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. ఇదే సమయంలో సామాన్యంగా మౌనంగా ఉండే దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు(K Raghavendra Rao) సైతం నోరు విప్పారు. ఆయన ట్విట్టర్ వేదికగా సీరియస్ గా స్పందించారు.
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. కేవలం సినిమా ప్రచారం కోసం ఏకంగా రూ. 80 కోట్లు ఖర్చు చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇదే తామైతే 10 సినిమాలు తీసి వాళ్ల మొఖాన కొట్టే వాళ్లమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దర్శకుడు. దీనిపై సామాజిక మాధ్యమాలలో విమర్శలతో పాటు కొందరు సపోర్ట్ గా నిలిచారు.
ఇక తమ్మారెడ్డి భరద్వాజను ఉద్దేశిస్తూ కె. రాఘవేంద్రరావు(K Raghavendra Rao) కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగు సినిమాకు అంతర్జాతీయ పరంగా ఖ్యాతి దక్కుతోంది. ఇప్పటికే యావత్ ప్రపంచం ఆస్కార్ అవార్డు కోసం వేచి చూస్తోంది. ఈ తరుణంలో సపోర్ట్ చేయాల్సింది పోయి ఇలా నిరాశకు గురయ్యేలా విమర్శలు చేస్తారా..ఇదేం పద్దతి అంటూ పేర్కొన్నారు.
వీలైతే మద్దతు తెలపాలి లేదంటే మౌనంగా ఉండాలి..కానీ వ్యక్తిగతంగా దాడి చేయడం మంచి పద్దతి కాదంటూ సూచించారు కె. రాఘవేంద్రరావు. ఇక నాగబాబు, దర్శకేంద్రుడు చేసిన కామెంట్స్ ఇంకా స్పందించ లేదు తమ్మారెడ్డి భరద్వాజ.
Also Read : తమ్మారెడ్డి కామెంట్స్ నాగబాబు సీరియస్