Oscar Awards 2023 Winners : ఆస్కార్ అవార్డులు విజేతలు
భారత్ కు రెండు పురస్కారాలు
Oscar Awards Winners 2023 : ఆస్కార్ పండుగ ముగిసింది. లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగిన ఈ పండుగలో భారత దేశానికి రెండు ఆస్కార్ పురస్కారాలు దక్కాయి(Oscar Awards Winners 2023) . ఉత్తమ నటిగా మిచెల్ యెహ్ గెలుపొందారు.
ఉత్తమ దర్శకుడు డేనియల్స్ గెలుపొందారు. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ లో ఆస్కార్ ను దక్కించుకుంది.
ఎస్ఎస్ రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ఒరిజనల్ సాంగ్ కేటగిరీలో అవార్డు పొందింది. ఇక ది ఎలిఫెంట్ విస్సరర్స్ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్టుగా గెలుచుకుంది.
మూడో భారతీయ చిత్రం ఆల్ దట్ బ్రీత్స్ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగం నుంచి తప్పుకుంది. ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు దీపికా పదుకొణే. ఈ ఆస్కార్ ఉత్సవానికి ఆర్ఆర్ఆర్ టీం రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ , రాజమౌళి, రాహుల్ సిప్లి గంజ్ , కార్తికేయ, కాల భైరవ, చంద్రబోస్ , ఎంఎం కీరవాణి హాజరయ్యారు.
ది వేల్ చిత్రానికి బ్రెండన్ ఫ్రేజర్ ఉత్తమ నటుడిగా నిలిచాడు. ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ నాలుగు ఆస్కార్ లను చేజిక్కించుకుంది(Oscar Awards Winners 2023) . జిమ్మీ కిమ్మెల్ హోస్ట్ గా వ్యవహరించారు.
ఇక అవార్డుల పరంగా చూస్తే ఇలా ఉన్నాయి. బెస్ట్ చిత్రం ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్. బెస్ట్ డైరెక్టర్ డేనియల్ క్వాన్ , డేనియల్ స్కీనర్ట్ .
ఉత్తమ(Best) నటి మిచెల్ యెహ్ , నటుడు బ్రెండన్ ఫ్రేజర్ , సహాయ నటి జామీ లీ కర్టిస్ , సహాయ నటుడు కే హుయ్ క్వాన్ .
ఉత్తమ ఒరిజినల్ సాంగ్ – నాటు నాటు – ఆర్ఆర్ఆర్ మూవీకి(Oscar Awards). ఒరిజనల్ స్కోర్ వెస్ట్రన్ ఫ్రంట్ లో ఆల్ క్వైట్ , ఒరిజనల్ స్క్రీన్ ప్లే ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్. బెస్ట్ అడా ప్లెడ్ స్క్రీన్ ప్లే ఉమెన్ టాకింగ్ . బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ ది ఎలిఫెంట్ విస్పరర్స్.
యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ గిల్లెర్మో డెల్ టోరస్ పినోచియో, ఉత్తమ(Best) యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ది బాయ్..ది మోల్..ది ఫాక్స్ అండ్ ది మార్స్. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ యాన్ ఐరిష్ గుడ్ బై.
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్. బెస్ట్ సినిమాటోగ్రఫీ ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ వెస్ట్రన్ ఫ్రంట్ లో ఆల్ క్వైట్ . ఉత్తమ(Best) ధ్వని టాప్ గన్ మావరిక్. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అవతార్ ది వే ఆఫ్ వాటర్.
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ బ్లాక్ పాంథర్ వకాండ ఫరెవర్. హెయిర్ అండ్ మేకప్ ది వేల్ . ఫిల్మ్ ఎడిటింగ్ లో ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ లో ఆస్కార్ అవార్డులు దక్కాయి(Oscar Awards).
Also Read : సినీ లోకంపై తెలుగు పాట సంతకం