Temjen Imna Along : టెమ్‌జెన్ ఇమ్నా వైరల్
వరల్డ్ స్లీప్ డే సందర్భంగా ట్వీట్
Temjen Imna Along Viral : భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, నాగాలాండ్ రాష్ట్ర మంత్రి టెమ్ జెన్ ఇమ్నా మరోసారి ఆసక్తికరంగా మారారు. ఆయన దేనిపైనా స్పందించినా వెంటనే వైరల్ గా మారుతున్నారు. తాజాగా ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని వరల్డ్ వైడ్ గా నిర్వహించారు. ఈ సందర్బంగా టెమ్ జెన్ ఇమ్నా(Temjen Imna Along Viral) తను మేల్కొని ఉండగా ఇతర ప్రయాణికులు నిద్ర పోతున్న ఫోటోను షేర్ చేశారు. ఇలా షేర్ చేశారో అలా వైరల్ గా మారింది.
ప్రస్తుతం టెమ్ జెన్ ఇమ్నా మరోసారి చర్చకు దారి తీసేలా మారి పోయారు. గతంలో టెమ్ జెన్ ఇమ్నా టీచర్ గా పని చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. అంచెలంచెలుగా పార్టీ చీఫ్ గా ఎదిగారు. రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా కొలువు తీరారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో రెండో సారి గెలుపొందారు. మంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేపట్టారు. టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్(Temjen Imna Along) ఒక గదిలో కూర్చున్నారు.
అక్కడ చాలా మంది వ్యక్తులు కుర్చీలపై నిద్రిస్తున్నారు. సుదీర్ఘమైన సెమినార్ లు, చర్చల పట్ల దృష్టిని ఆకర్షించేందుకు ఉద్దేశించబడింది. ఈ సమయంలో హాజరైన వారు అంశంపై నిరంతరం శ్రద్ద చూపలేక పోయారు. వారి సీట్లపై నిద్ర పోయారు. ఈ సందర్బంగా తన హచరులకు, హాజరైన వారందరికీ ప్రపంచ నిద్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ అందమైన క్యాప్షన్ పెట్టారు. 24/7 మేల్కొని ఉండటం సాధ్యం కాదని తేలి పోయిందని పేర్కొన్నారు టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్.
Also Read : మోదీకి విందు ఇవ్వనున్న బైడెన్