Eatala Rajender : ఈటలకు షాక్ పోలీసుల నోటీసులు
రోజు రోజుకు కేసు కొత్త మలుపు
Eatala Rajender : పదో తరగతి పరీక్షల లీకు వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ జైలుకు తరలించారు. విచారణ చేపట్టిన పోలీసులు మరింత దూకుడు పెంచారు. తాజాగా బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eatala Rajender) కు బిగ్ షాక్ ఇచ్చారు. ఆయనతో పాటు పీఏకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రశాంత్ పేపర్ ను ఈటల రాజేందర్ కు పంపించారని, దానిని పీఏ సర్కులేట్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పేపర్ లీక్ మొత్తం హుజూరాబాద్ నియోజకవర్గం చుట్టే తిరుగుతుండడంపై ఆరా తీస్తున్నారు. దీని వెనుక ఉన్నది ఎవరు. కావాలనే లీక్ చేశారా లేక దీని వెనుక ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే విచారణ చేపడుతున్న వరంగల్ జిల్లా పోలీసులు ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eatala Rajender) కు , ఆయన పీఏకు కూడా నోటీసులు ఇవ్వనున్నారు. మరో వైపు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ను ఏ1 గా పేర్కొంటూ ఆయనను కరీంనగర్ కు తరలించారు. ఆయనకు 11 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీనిని సవాల్ చేస్తూ బీజేపీ లీగల్ టీం బండికి బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. మొత్తంగా పేపర్ లీక్ ఎపిసోడ్ రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీసింది.
Also Read : అవాస్తవం రాజీనామా అబద్దం