Vijay Devarakonda : స‌మంత రియ‌ల్ ఫైట‌ర్ – దేవ‌ర‌కొండ‌

స‌హ న‌టుడి బెస్ట్ ఆఫ్ ల‌క్ వైర‌ల్

Vijay Devarakonda : తెలుగు సినీ రంగంపై చెర‌గ‌ని సంత‌కం చేసింది స‌మంత రుత్ ప్ర‌భు. ఆమె నాగ చైత‌న్య‌తో విడి పోయాక మ‌రిన్ని సినిమాల‌కు సంత‌కం చేసింది. స‌మంత న‌టించిన పుష్ప మూవీలో చేసిన ఊ అంటావా సాంగ్ దుమ్ము రేపింది. సినిమా కంటే స‌మంత‌కే ప్ర‌యారిటీ ల‌భించింది. కోట్లు కొల్ల‌గొట్టింది ఈ చిత్రం. తాజాగా పుష్ప -2 మూవీ కూడా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. తాను ఇందులో న‌టించ‌డం లేదంటూ స్ప‌ష్టం చేసింది.

ప్ర‌స్తుతం స‌మంత రుత్ ప్ర‌భు గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శాకుంత‌లం ప్ర‌స్తుతం విడుద‌లకు సిద్ద‌మైంది. ఈ సంద‌ర్భంగా త‌న స‌హ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ స‌మంత గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. బెస్ట్ ఆఫ్ ల‌క్ అంటూ చెప్పాడు. ప్ర‌స్తుతం రౌడీ బాయ్ నోట్ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌(Vijay Devarakonda) , స‌మంత రుత్ ప్ర‌భు క‌లిసి కుషీ చిత్రంలో న‌టిస్తున్నారు. ఇందులో భాగంగా స‌మంత గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మీరు చాలా ప్రేమ‌తో నిండి ఉన్నారు. ఎల్ల‌ప్పుడూ ప‌నిలో ఉండాల‌ని అనుకుంటారు. నిరంత‌రం ఉత్సాహాన్ని పంచుతారు. సినిమాలో ప్ర‌తి షాట్ అద్బుతంగా రావాల‌ని కోరుకుంటారు. వృత్తి ప‌ట్ల మీకున్న నిబ‌ద్ద‌త ఎల్ల‌ప్ప‌టికీ గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నాడు.

అంతే కాదు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. సమంత‌ను రియ‌ల్ ఫైట‌ర్ గా అభివ‌ర్ణించారు. ఈ స‌మ‌యంలో మీకు విరామం కావాలి..విశ్రాంతి కావాల‌ని తెలిపాడు స‌హ న‌టుడు.

Also Read : ఎల్లో అందాలతో హాట్ రొమాంటిక్ గా పూజ హెగ్డే

Leave A Reply

Your Email Id will not be published!