Hardik Pandya Fined : నిన్న శాంసన్ నేడు పాండ్యాకు ఫైన్
గెలిచిన ఆనందం కొద్ది సేపే
Hardik Pandya Fined : ఐపీఎల్ 16వ సీజన్ లో ఆయా జట్లకు గెలిచినా ఆనందం లేకుండా పోతోంది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్ పడుతోంది. మొన్నటికి మొన్న బెంగళూరు వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా రూ. 14 లక్షల ఫైన్ పడింది ఆర్సీబీ స్కిప్పర్ ఫాఫ్ డు ప్లెసిస్ కు.
ఇక చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్ కు షాక్ ఇచ్చింది బీసీసీఐ. స్లో ఓవర్ రేట్ కారణంగా రూ. 12 లక్షల ఫైన్ పడింది. ఇంకోసారి ఇలా చేస్తే ఐపీఎల్ లో ఒక మ్యాచ్ పై వేటు పడనుందని హెచ్చరించింది.
తాజాగా పంజాబ్ లోని మొహాలీలో జరిగిన లీగ్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ స్కిప్పర్ హార్దిక్ పాండ్యాకు(Hardik Pandya Fined) బిగ్ షాక్ ఇచ్చింది బీసీసీఐ. ఈ మేరకు రూ. 12 లక్షల జరిమానా విధించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఈ ఫైన్ వేసినట్లు తెలిపింది. నిర్ణీత సమయంలో ఓవర్లు వేయాల్సి ఉండగా కోటాను పూర్తి చేయలేక పోయింది. దీంతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ చర్యలు తీసుకున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.
స్లో ఓవర్ రేట్ తప్పిదం తొలిసారి కావడంతో రూ. 12 లక్షల ఫైన్ వేశామని , రెండోసారి చేస్తే రూ. 24 లక్షలు వేస్తామని హెచ్చరించింది. మిగిలిన 10 మంది ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 6 లక్షల రూపాయలు లేదా 24 శాతం జరిమానా పడుతుంది.
Also Read : ఆ క్రెడిట్ అంతా మలింగ..శాంసన్ దే