MI vs KKR IPL 2023 : ముంబై గెలిచేనా కోల్ క‌తా నిలిచేనా

ఇరు జ‌ట్ల మ‌ధ్య కీల‌క మ్యాచ్ కు రెడీ

MI vs KKR IPL 2023 : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో కీల‌క‌మైన పోరాటానికి రెడీ అయ్యాయి రోహిత్ సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్ నితీశ్ రాణా నేతృత్వంలోని కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్(MI vs KKR IPL 2023). ఇప్ప‌టి వ‌ర‌కు లీగ్ లో మూడు మ్యాచ్ లు ఆడిన ముంబై 2 మ్యాచ్ ల‌లో ఓడి పోయింది.

ఒక్క మ్యాచ్ లో గెలుపొందింది. ఇక పాయింట్ల ప‌ట్టిక‌లో 10వ స్థానంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ 5 మ్యాచ్ ల‌లో ఓడి పోయి ఆఖ‌రులో నిలిస్తే ముంబై ఇండియ‌న్స్ 9వ స్థానంలో కొన‌సాగుతోంది. ఇక కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ఇప్ప‌టి దాకా 4 మ్యాచ్ లు ఆడితే 2 మ్యాచ్ ల‌లో ఓడి పోయింది. మ‌రో రెండు మ్యాచ్ ల‌లో గెలుపొందింది.

ఇరు జ‌ట్ల‌కు ఈ లీగ్ మ్యాచ్ కీల‌కం. ముంబై లోని వాంఖ‌డే స్టేడియంలో ఈ లీగ్ మ్యాచ్ కు వేదిక కానుంది. స్వంత గ్రౌండ్ లో ముంబైకి అడ్వాంటేజ్ గా మార‌నుంది. కానీ కోల్ క‌తా సైతం అద్భుత ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రుస్తోంది. ఆ జ‌ట్టు స‌న్ రైజ‌ర్స్ తో చివ‌రి వ‌ర‌కు పోరాడింది. హైద‌రాబాద్ రికార్డ్ స్కోర్ న‌మోదు చేసింది. 20 ఓవ‌ర్ల‌లో 228 ర‌న్స్ చేసింది. ఇక కోల్ క‌తా జ‌ట్టు 205 ప‌రుగులు చేసింది. కేవ‌లం 23 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. ప్ర‌ధానంగా స్టార్ హిట్ట‌ర్ రింకూ సింగ్, కెప్టెన్ రాణా ఫుల్ ఫామ్ లో ఉన్నారు.

ఇరు జ‌ట్ల బలాలు చూస్తే ముంబై ఇండియ‌న్స్ కంటే కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు బ‌లంగా క‌నిపిస్తోంది. కానీ మైదానంలోకి దిగితే కానీ ఎవ‌రు గెలుస్తార‌నేది చెప్ప‌డం క‌ష్టం. ఎందుకంటే ఇది పొట్టి ఫార్మాట్ కాబ‌ట్టి. మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Also Read : స‌మ ఉజ్జీల పోరుకు సై

Leave A Reply

Your Email Id will not be published!