Venkatesh Iyer : చిత‌కొట్టిన వెంక‌టేశ్ అయ్య‌ర్

9 సిక్సులు 6 ఫోర్ల‌తో తొలి సెంచ‌రీ

Venkatesh Iyer : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ఆట‌గాడు వెంక‌టేశ్ అయ్య‌ర్ దుమ్ము రేపాడు. సెంచ‌రీతో క‌దం తొక్కాడు. పూన‌కం వ‌చ్చిన‌ట్లు రెచ్చి పోయాడు. 9 సిక్సులు 6 ఫోర్ల‌తో స‌త్తా చాటాడు. ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో ముంబై ఇండియ‌న్స్ తో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో చుక్క‌లు చూపించాడు. గాయ‌ప‌డినా ఎక్క‌డా త‌గ్గ‌లేదు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో అల‌రించాడు. మొద‌ట బ్యాటింగ్ చేసిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 185 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.

మూడో స్థానంలో మైదానంలోకి వ‌చ్చిన వెంక‌టేశ్ అయ్య‌ర్ (Venkatesh Iyer) 49 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్నాడు. త‌న టి20 కెరీర్ లో మొద‌టి సెంచ‌రీ సాధించాడు. ఈ సీజ‌న్ లో తొలి సెంచ‌రీ చేసిన భార‌తీయ బ్యాట‌ర్ గా నిలిచాడు. అంత‌కు ముందు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు చెందిన ఇంగ్లండ్ బ్యాట‌ర్ హ్యారీ బ్రూక్ సెంచ‌రీ చేసి రికార్డు న‌మోదు చేశాడు.

ఇదిలా ఉండ‌గా ఇన్నింగ్స్ నాలుగో ఓవ‌ర్ లో బంతి మోకాలిని బ‌లంగా తాక‌డంతో మైదానంలో ప‌డి పోయాడు. విల విల లాడి పోయాడు. ఫిజియో థెర‌పీ చికిత్స చేయ‌డంతో తిరిగి నొప్పితోనే ఆడాడు. త‌న‌కు ఎదురే లేద‌ని చాటాడు. ఇదిలా ఉండగా ముంబై ముందు 186 ప‌రుగుల ల‌క్ష్యం నిర్దేశించింది కేకీఆర్.

Also Read : బ‌ట్ల‌ర్ కు ల‌వ్ ప్ర‌పోజ‌ల్

Leave A Reply

Your Email Id will not be published!