MI vs KKR IPL 2023 : కోల్ క‌తాకు షాక్ ముంబై ఝ‌ల‌క్

ఇషాన్ సూప‌ర్ సూర్య బెట‌ర్

MI vs KKR IPL 2023 : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో భాగంగా ముంబై వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కు కోలుకోలేని దెబ్బ త‌గిలింది. భారీ టార్గెట్ ను ముంబై ఇండియ‌న్స్(MI vs KKR IPL 2023) సుల‌భంగా ఛేదించింది. కోల్ క‌తా కు చెందిన వెంక‌టేశ్ అయ్య‌ర్ చిచ్చ‌ర పిడుగులా చెల‌రేగాడు. శ‌త‌కం చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. ముంబై ఊహించ‌ని రీతిలో విజ‌యం సాధించింది.

5 వికెట్ల తేడాతో కోల్ క‌తాపై గెలుపొందింది. ముంబై బ్యాట‌ర్లు ఇషాన్ కిషాన్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడితే సూర్య కుమార్ యాద‌వ్ క్లాసిక్ షాట్స్ తో అల‌రించాడు. విచిత్రం ఏమిటంటే గ‌త నాలుగు మ్యాచ్ ల‌లో వ‌రుస‌గా డ‌కౌట్ అయిన సూర్య ఈ మ్యాచ్ లో రాణించాడు. ముంబైకి ఇది 23వ విక్టరీ కావ‌డం విశేషం. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో ముంబై ఈ విజ‌యంతో 8వ స్థానంలో నిలిచింది.

అంత‌కు ముందు ముంబై ఇండియ‌న్స్ స్కిప్ప‌ర్ రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కోల్ క‌తా 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 185 ర‌న్స్ చేసింది. 186 ర‌న్స్ టార్గెట్ ను ముంబై 17.4 ఓవ‌ర్ల‌లోనే ఛేదించింది.

ఇక ముంబై త‌ర‌పున మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు ఇషాన్ కిష‌న్ . 25 బంతులు ఎదుర్కొని 58 ర‌న్స్ చేశాడు. రోహిత్ శ‌ర్మ తో క‌లిసి 65 ప‌రుగుల పార్ట‌ర్న‌ర్షిప్ నెల‌కొల్పారు. సూర్య ఈసారి స‌త్తా చాటితే ఎప్ప‌టి లాగే తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ కీల‌క పాత్ర పోషించాడు.

Also Read : రాజస్థాన్ రాజ‌సం గుజ‌రాత్ ప‌రాజ‌యం

Leave A Reply

Your Email Id will not be published!