Sanju Samson IPL 2023 : సంజూ శాంస‌న్ మార‌థాన్ ఇన్నింగ్స్

గుజ‌రాత్ కు చుక్క‌లు చూపించిన స్కిప్ప‌ర్

Sanju Samson IPL 2023 : కేర‌ళ స్టార్ హిట్ట‌ర్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్కిప్ప‌ర్ సంజూ శాంస‌న్(Sanju Samson) దుమ్ము రేపాడు. అత్యంత బాధ్య‌తాయుత‌మైన ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. ప‌వ‌ర్ ప్లేలో ఒకానొక ద‌శ‌లో 2 వికెట్లు కోల్పోయి 26 ప‌రుగులు చేసినా ఆ త‌ర్వాత క‌ళ్లు చెదిరే షాట్స్ తో ఆక‌ట్టుకున్నాడు. త‌న‌కు ఎదురే లేద‌ని చాటాడు. ఒకానొక ద‌శ‌లో రాజ‌స్థాన్ ఓడిపోతుంద‌ని అనుకున్నారు. కానీ ఊహించ‌ని రీతిలో గుజ‌రాత్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది.

ముందుగా బ్యాటింగ్ కు దిగిన గుజ‌రాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 177 ర‌న్స్ చేసింది. అనంత‌రం 178 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాజ‌స్థాన్ మొద‌ట్లోనే తడ‌బ‌డింది. జైశ్వాల్ , బట్ల‌ర్ త‌క్కువ‌కే వెనుదిరిగారు. ఏ మాత్రం స‌పోర్ట్ లేని మైదానంలో క్రీజులోకి వ‌చ్చిన ప‌డిక్క‌ల్ , శాంస‌న్ క‌లిసి ఇన్నింగ్స్ ను చ‌క్క‌దిద్దారు. 13 ర‌న్ రేట్ ఉన్నా ఎక్క‌డా త‌గ్గ‌లేదు కెప్టెన్ సంజూ శాంస‌న్. కేవ‌లం 32 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న సంజూ 6 సిక్సర్లు 3 ఫోర్లతో రెచ్చి పోయాడు.

స్టార్ బౌల‌ర్ ర‌షీద్ ఖాన్ బౌలింగ్ లో 13వ ఓవ‌ర్ లో వ‌రుస‌గా మూడు సిక్స‌ర్లు కొట్టి చుక్క‌లు చూపించాడు. ఒక ర‌కంగా గుజ‌రాత్ పై ప్ర‌తీకారం తీర్చుకున్నాడు. గ‌త రెండు మ్యాచ్ ల‌లో డ‌కౌట్ అయిన శాంస‌న్(Sanju Samson IPL 2023) కీల‌క‌మైన ఇన్నింగ్స్ తో చెల‌రేగాడు. దుమ్ము రేపుతున్న సంజూను ఇంపాక్ట్ బౌల‌ర్ నూర్ అహ్మ‌ద్ బౌలింగ్ లో వ‌రుస‌గా ఫోర్ , సిక్స్ కొట్టాడు. ఆ త‌ర్వాతి బంతికి సిక్స్ కొట్ట‌బోయి వెనుదిరిగాడు. హెట్మెయ‌ర్ 56 ర‌న్స్ తో రెచ్చి పోయాడు. ఇంకా 4 బంతులు మిగిలి ఉండ‌గానే రాజ‌స్థాన్ విజ‌యం సాధించింది.

Also Read : రాజస్థాన్ రాజ‌సం గుజ‌రాత్ ప‌రాజ‌యం

Leave A Reply

Your Email Id will not be published!