RCB vs CSK IPL 2023 : చెన్నై గెలిచేనా బెంగ‌ళూరు నిలిచేనా

ఐపీఎల్ లో కీల‌క లీగ్ మ్యాచ్

RCB vs CSK IPL 2023 : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో కీల‌క‌మైన 24వ లీగ్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఫాఫ్ డు ప్లెసిస్ సార‌థ్యంలోని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు మ‌హేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్(RCB vs CSK IPL 2023) త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇక ఇరు జ‌ట్ల విష‌యానికి వ‌స్తే ఇప్ప‌టి వ‌ర‌కు రెండు జ‌ట్లు నాలుగు మ్యాచ్ ల చొప్పున ఆడాయి. చెన్నై 2 గెలిచి 2 ఓడి పోయింది. ఇక బెంగ‌ళూరు కూడా సేమ్ సీన్. రెండిట్లో విజ‌యం సాధించి మ‌రో రెండింట్లో ప‌రాజ‌యం పాలైంది. ఇరు జ‌ట్ల‌కు ఈ మ్యాచ్ కీల‌కం కానుంది.

చెన్నై సూపర్ కింగ్స్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చేతిలో చివ‌రి వ‌ర‌కు పోరాడి త‌ల వంచింది. సందీప్ శ‌ర్మ అద్భుత‌మైన బౌలింగ్ దెబ్బ‌కు కేవ‌లం 3 ప‌రుగుల తేడాతో చేజార్చుకుంది. సోమ‌వారం చెన్నై లోని చిన్న స్వామి స్టేడియంలో జ‌రిగే ఈ మ్యాచ్ పై త‌మిళ తంబీలు గంపెడాశ‌లు పెట్టుకున్నారు. ఇరు జ‌ట్లు ఆట‌గాళ్ల ప‌రంగా బ‌లంగా క‌నిపిస్తున్నా మైదానంలోకి దిగాక సీన్ మారుతోంది. అంచ‌నాలు తారుమార‌వుతున్నాయి.

ఇక ఐపీఎల్ లో ఇప్ప‌టి వ‌ర‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్ , రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మ‌ధ్య 30 మ్యాచ్ లు జ‌రిగాయి. వీటిలో 10 మ్యాచ్ ల‌లో ఆర్సీబీ గెలిస్తే 19 మ్యాచ్ ల‌లో చెన్నై స‌త్తా చాటింది. ఒక మ్యాచ్ రిజ‌ల్ట్ రాలేదు. రాత్రి 7.30 గంట‌ల‌కు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండ‌నుంద‌ని అంచ‌నా. ఆర్సీబీలో హ‌స‌రంగా, వైషాక్ చేరారు.

జ‌ట్ల ప‌రంగా చూస్తే ఆర్సీబీలో కోహ్లీ, డు ప్లెసిస్ (స్కిప్ప‌ర్) , లోమ్రోర్ , రావ‌త్, మాక్స్ వెల్ , షాబాజ్, కార్తీక్ , హ‌స‌రంగా , ప‌టేల్ , పార్నెల్ , సిరాజ్ , వైషాక్ ఆడ‌తారు.
ఇక చెన్నై సూప‌ర్ కిం్స్ లో కాన్వే, గైక్వాడ్ , ర‌హానే , మొయిన్ అలీ, శివ‌మ్ దూబే, జ‌డేజా , ధోనీ (కెప్టెన్ ), ప్రిటోరియ‌స్ , మ‌హేష్ తీక్ష‌ణ‌, తుషార్ దేశ్ పాండే, అంబ‌టి రాయుడు, ఆకాష్ సింగ్ ఆడ‌నున్నారు.

Also Read : సూర్య స్కిప్ప‌ర్ రోహిత్ ఇంపాక్ట్ ప్లేయ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!