Apple Mumbai Craze : ముంబై యాపిల్ స్టోర్ వద్ద సందడి
కళ్లు జిగేల్ మనిపించేలా స్టోర్
Apple Mumbai Craze : వరల్డ్ వైడ్ గా మోస్ట్ పాపులర్ మొబైల్ కంపెనీగా పేరొందిన యాపిల్ కంపెనీ భారత్ లో ముంబై , ఢిల్లీలో స్టోర్ లను మొదటిసారిగా ప్రారంభించింది. సంస్థ సిఇఓ టిమ్ కుక్ ముంబైలో కొలువు తీరారు. ఆయన నటి మాధురి దీక్షిత్ తో కలిసి ఆయన రెస్టారెంట్ లో వడ పావ్ రుచి చూశారు.
నభూతో నభవిష్యత్ అన్న రీతిలో యాపిల్ స్టోర్ ను తీర్చి దిద్దారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. దేనికదే భిన్నంగా ఉండేలా చూసింది సంస్థ. ముంబైలో ఏర్పాటు చేసిన యాపిల్ స్టోర్ కు పరుగులు తీస్తున్నారు యాపిల్ ఫ్యాన్స్. ముఖ్యంగా యూత్ , చిన్నారులు, పెద్దలు, మహిళలు ఇలా ప్రతి ఒక్కరు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం యాపిల్ స్టోర్(Apple Mumbai Craze) ఉన్న కాంప్లెక్స్ పూర్తిగా జాతర లాగా మారి పోయింది.
తొలి అధికారిక ఇండియా స్టోర్ ముంబైలో ప్రారంభం కావడంతో ఉత్సాహం రెట్టింపైంది కస్టమర్లు, కొనుగోలుదారుల్లో. ఇదిలా ఉండగా మొదటి రిటైల్ స్టోర్ లోకి ప్రవేశించే అదృష్ట వంతులలో కొంతమందిలో ఒకరుగా ఉండాలని ఆశిస్తున్న సుమారు 200 మంది యాపిల్ అభిమానులు వేచి ఉన్నారు.
టిమ్ కుక్ ను చూసేందుకు పోటీ పడ్డారు. ఈ స్టోర్ 28,000 అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు యాపిల్ స్టోర్.
Also Read : మాధురి యాపిల్ సిఇఓ వైరల్