PM Modi Tribute : బసవేశ్వరుడు ఆదర్శప్రాయుడు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
PM Modi Tribute : సంఘ సంస్కర్త బసవేశ్వరుడు ఆదర్శ ప్రాయుడని కొనియాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi Tribute). ఏప్రిల్ 23 ఆదివారం ఆయన జయంతి. ఈ సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు పీఎం. ఇక లింగాయత్ లు అత్యధికంగా ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఈ దినోత్సవాన్ని నిర్వహించేందుకు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, పవర్ లోకి రావాలని పరితపిస్తున్న కాంగ్రెస్ పార్టీ పోటా పోటీగా ముందడుగు వేస్తున్నాయి.
ఇదిలా ఉండగా ప్రధానమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో బసవేశ్వరుడి ఆలోచనలు ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. బసవేశ్వరుని ఆలోచనలు, ఆదర్శాలు సమస్త మానవాళికి సేవ చేసేందుకు స్పూర్తి కలిగించేలా చేస్తున్నాయని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ(PM Modi).
బసవేశ్వరుడు రాజనీతిజ్ఞుడు, కవి, సంఘ సంస్కర్త. ఇవాళ జాతికి సుదినం. జగద్గురు బసవేశ్వరునికి నేను తలవంచి నమస్కరిస్తున్నాను. అణగారిన వర్గాలకు సాధికారత కల్పించి, బలమైన, సంపన్నమైన సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చిన మహనీయుడు అని కొనియాడారు ప్రధానమంత్రి. లింగ వివక్షకు, కుల వివక్షకు వ్యతిరేకంగా నిలిచిన బసవేశ్వరుడు లింగాయత్ తత్వానికి చోదక శక్తిగా ఉన్నారని కితాబు ఇచ్చారు నరేంద్ర దామోదర దాస్ మోదీ.
Also Read : ముప్పు తిప్పలు పెట్టిన ‘సింగ్’