TTD Tickets : శ్రీ‌వారి భ‌క్తుల‌కు టీటీడీ తీపి క‌బురు

మే, జూన్ నెల‌ల‌కు టికెట్లు విడుద‌ల

TTD Tickets : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు నిత్యం వేలాది మంది శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకుంటారు. ఇటీవ‌లి కాలంలో భ‌క్తుల ర‌ద్దీ మ‌రింత పెరిగింది. టీటీడీ(TTD Tickets) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌తిసారి నెల‌కు సంబంధించి మాత్ర‌మే రూ. 300 టికెట్లు ఆన్ లైన్ లో విడుద‌ల చేసేది.

కానీ ఈసారి మాత్రం టీటీడీ అందుకు విరుద్దంగా వ‌చ్చే మే, జూన్ నెల‌ల‌కు సంబంధించి ఒకేసారి టికెట్ల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. టికెట్ల‌తో పాటు అద్దె గ‌దుల‌కు సంబంధించి కూడా బుకింగ్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం.

ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తి నెలా చివ‌రి వారంలో రూ. 300 టికెట్ల‌ను విడుద‌ల చేస్తూ వ‌చ్చేది టీటీడీ. కానీ ఈసారి అందుకు భిన్నంగా నిర్ణ‌యం తీసుకుంది. ఈసారి మాత్రం మే నెల‌తో పాటు జూన్ నెల టికెట్ల‌ను కూడా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.

ఇందుకు సంబంధించి ఏప్రిల్ 25న మంగ‌ళ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్ లైన్ లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ టికెట్లు tirupatibalaji.ap.gov.in లేదా TT devasthanams యాప్‌లో అందుబాటులో టికెట్లు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది.

Also Read : అలిపిరి ద్వారా వెళితేనే టోకెన్లు

Leave A Reply

Your Email Id will not be published!