హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో సోమవారం సన్ రైజర్స్ హైదరాబాద్ , ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య కీలక లీగ్ మ్యాచ్ కొనసాగనుంది. విచిత్రం ఏమిటంటే సన్ రైజర్స్ కు ప్రాతినిధ్యం వహించిన ఆసిస్ స్టార్ హిట్టర్ డేవిడ్ వార్నర్ అనుకోకుండా ఆ జట్టు నుంచి నిష్క్రమించాడు. ఒక రకంగా అతడిని అవమానకరమైన రీతిలో బయటకు పంపించారు. దీనిని తట్టుకోలేక వార్నర్ కంటతడి పెట్టాడు. అప్పట్లో అది హాట్ టాపిక్ గా మారింది.
కానీ ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ వార్నర్ ను తీసుకుంది. ప్రస్తుతం వార్నర్ ఈ సారి ఐపీఎల్ లో మెరుగైన ఆట తీరును ప్రదర్శిస్తున్నాడు. రిషబ్ పంత్ గాయపడడంతో అతడి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్ గా ఉన్నాడు. ఇప్పటి వరకు 6 మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఒకే ఒక్క మ్యాచ్ లో గెలుపొంది 5 మ్యాచ్ లలో ఓటమి పాలైంది. వార్నర్ ఒక్కడే రాణిస్తున్నా మిగతా వాళ్లంతా పెవిలియన్ బాట పట్టారు. మార్క్రామ్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ 6 మ్యాచ్ లు ఆడింది 2 మ్యాచ్ లలో గెలుపొంది 4 మ్యాచ్ లలో ఓటమి పాలైంది.
ఇవాళ తాను ఇప్పటి వరకు ఆడిన సన్ రైజర్స్ తో పోటీ పడనున్నాడు డేవిడ్ వార్నర్. ఇది ఊహించని పరిణామం అని చెప్పక తప్పదు. ఇరు జట్లకు ఈ లీగ్ కీలకం. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే గెలిచి తీరాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చెన్నై ,రాజస్థాన్ టాప్ లో కొనసాగుతున్నాయి. చివరకు 4 స్థానాలలో ఉన్న జట్లే ప్లే ఆఫ్స్ కు చేరుకుంటాయి. ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. విజయం కోసం గట్టిగా పోరాడటం ఖాయం.