Priyanka Gandhi Likes : కన్నడ రుచులకు ప్రియాంక ఫిదా
మైసూర్ రెస్టారెంట్ లో ప్రియాంక
Priyanka Gandhi Likes : కర్ణాటకలో రాజకీయ వాతావరణం మరింత వేడిని పుట్టిస్తోంది. ప్రస్తుతం బస్వరాజ్ బొమ్మై సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ కొలువు తీరింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలోకి రావడానికి శత విధాలుగా ప్రయత్నిస్తోంది. బరిలో ఆప్ , ఎంఐఎం, జేడీఎస్ ఉన్నా ప్రధాన పోటీ మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారి పోయింది.
ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర నాయకులంతా కర్ణాటక పై ఫోకస్ పెట్టారు. తాజాగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విస్తృతంగా పర్యటిస్తున్నారు. తన సోదరుడు రాహుల్ గాంధీ(Priyanka Gandhi Likes) ఇప్పటికే పలుమార్లు పర్యటించారు. అంతకు ముందు ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్రకు అనూహ్యమైన స్పందన లభించింది.
ఇదే సమయంలో ప్రియాంక గాంధీ ఇప్పుడు కర్ణాటకలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఆమె కన్నడ నాట రుచులను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్, ఇంఛార్జ్ సూర్జేవాలా, తదితర నాయకులతో కలిసి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) హల్ చల్ చేశారు. మైసూర్ లో అత్యంత పేరొందిన రెస్టారెంట్ మైలరీని సందర్శించారు. అక్కడ ఇడ్లీతో పాటు ఇతర టిఫిన్లను రుచి చూశారు ప్రియాంక గాంధీ. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
Also Read : అవినీతిలో కర్ణాటక సర్కార్ టాప్