E Jean Carroll Trump : ట్రంప్ నన్ను రేప్ చేశాడు – కారోల్
యుఎస్ రచయిత్రి సంచలన కామెంట్స్
E Jean Carroll Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) కు కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే యుఎస్ కు చెందిన పోర్న్ స్టార్ విషయంలో ఆయన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ , మాజీ ఎల్లే మ్యాగజైన్ కాలమిస్ట్ ఇ జీన్ కారోల్ సంచలన కామెంట్స్ చేశారు. తనను డొనాల్డ్ ట్రంప్ రేప్ చేశాడంటూ ఆరోపించారు.
గతంలో తను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ విషయాన్ని చెబుదామని అనుకున్నానని కానీ తను పవర్ ఫుల్ పోస్ట్ లో ఉండడం వల్ల చంపుతారేమోనని భయపడి చెప్పలేదని స్పష్టం చేసింది కారోల్(E Jean Carroll).
ఏదో ఒక రోజు నిజం చెప్పక పోతే మరికొందరు ట్రంప్ బాధితుల్లో చేరే అవకాశం ఉందని బాధ పడి బయటకు వచ్చానని , నోరు విప్పానని తెలిపింది. కొన్ని దశాబ్దాలుగా తాను మౌనంగా ఉన్నానని చెప్పారు. ఇదిలా ఉండగా తనను ఎప్పుడు రేప్ చేశాడనే విషయం కూడా కుండ బద్దలు కొట్టింది కారోల్. 1990లో బెర్గ్ డార్ఫ్ గుడ్ మ్యాన్ డ్రెస్సింగ్ రూమ్ లో డొనాల్డ్ ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని వాపోయింది. ఇదే విషయం గురించి జ్యూరీ ముందు వెల్లడించింది.
ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నారన్న ప్రశ్నకు ఆమె కీలక సమాధానం చెప్పింది. తనను లేకుండా చేస్తారేమోనన్న ఒకే ఒక్క కారణంగా బయటకు చెప్పలేక పోయానని కారోలో(E Jean Carroll) వాపోయింది. మాన్ హాటన్ ఫెడరల్ కోర్టులో రికార్డును సరిదిద్దేందుకు తాను దావా వేసినట్లు ఆమె వాంగ్మూలం ఇచ్చింది. ట్రంప్ నా ప్రతిష్టను నాశనం చేశాడు. నేను జీవితాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు కారోల్. దీనిని డొనాల్డ్ ట్రంప్ ఖండించాడు. ఇదంతా కట్టు కథ అంటూ పేర్కొన్నాడు.
Also Read : ఢిల్లీ మేయర్ గా షెల్లీ ఒబెరాయ్