Abhishek Sharma : అభిషేక్ శ‌ర్మ అదుర్స్

స‌త్తా చాటిన క్రికెట‌ర్

Abhishek Sharma : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో ఎట్ట‌కేల‌కు ఓ విజ‌యాన్ని న‌మోదు చేసింది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్. ఢిల్లీలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ తో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ సాధించింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ 20 ఓవ‌ర్ల‌లో 188 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసింది హైద‌రాబాద్.

హైద‌రాబాద్ జ‌ట్టులో అభిషేక్ శర్మ(Abhishek Sharma) అద్భుతంగా ఆడాడు. జ‌ట్టును విజ‌య ప‌థంలోకి తీసుకు వెళ్ల‌డంలో కీల పాత్ర పోషించాడు. మ‌రో కీల‌క ఆట‌గాడు హెన్రిచ్ క్లాసెన్ సాయంతో సూప‌ర్ ఇన్నింగ్స్ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. 36 బంతులు ఎదుర్కొన్న శ‌ర్మ 67 ర‌న్స్ చేశాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ఎస్ ఆర్ హెచ్ స్కిప్ప‌ర్ ఐడెన్ మార్క్రామ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ క్యాపిట‌ల్స్ ముందు 198 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ముందుంచింది.

హైద‌రాబాద్ బ్యాటిండ్ ఆర్డ‌ర్ మంచి ప్రారంభాన్ని ఇవ్వ‌లేక పోయింది. ప‌వ‌ర్ ప్లే లోనే 2 వికెట్లు కోల్పోయింది. మ‌యాంక్ అగ‌ర్వాల్ 5 , రాహుల్ త్రిపాఠి 10 ప‌రుగుల‌కే వెనుదిరిగారు. ఆ జ‌ట్టు త‌ర్వాతి రెండు ఓవ‌ర్ల‌లో మ‌రో రెండు కీల‌క‌మైన వికెట్ల‌ను కోల్పోయింది. కెప్టెన్ మార్క్రామ్ 8 , హ్యారీ బ్రూక్ గోల్డెన్ డ‌కౌట్ గా వెనుదిరిగాడు.

ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా ఎక్క‌డా త‌గ్గ‌లేదు అభిషేక్ శ‌ర్మ‌(Abhishek Sharma). హెన్రిచ్ క్లాసెన్ తో క‌లిసి బ‌ల‌మైన భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. 36 బాల్స్ లో 67 ర‌న్స్ చేశాడు. క్లాసెన్ 27 బంతుల్లో 53 ర‌న్స్ చేశాడు. స‌మ‌ద్ 28 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు.

Also Read : మిచెల్ మార్ష్ ఆల్ రౌండ్ షో

Leave A Reply

Your Email Id will not be published!