Navjyot Singh Sidhu : రెజ్లర్ల ఆవేదన సిద్దూ ఆలంబన
బ్రిజ్ భూషణ్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదు
Navjyot Singh Sidhu : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ ను అరెస్ట్ చేయాలని కోరుతూ మహిళా రెజ్లర్లు గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. వీరికి మద్దతు తెలిపారు సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ , కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. సోమవారం పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ , మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ మహిళా రెజ్లర్లకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారికి తాను ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు సిద్దూ. ఇది పూర్తిగా తల వంచు కోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మహళా రెజ్లర్ల పట్ల లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయని సాక్షాత్తు బాధితులే వాపోయినా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు సిద్దూ. ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్యేనని మండిపడ్డారు. ఎంతో కష్టపడి పతకాలు సాధించిన అథ్లెట్లతో నిత్యం ఫోటోలు దిగే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఏం చేస్తున్నారని, నిద్ర పోతున్నారా అంటూ నిప్పులు చెరిగారు నవజ్యోత్ సింగ్ సిద్దూ(Navjyot Singh Sidhu).
ఇప్పటికే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారని కానీ ఎందుకు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రాజీనామా చేయడం లేదని , దీని వెనుక ఎవరు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా రెజ్లర్లు ఆందోళన చేస్తుంటే రాజకీయ కుట్ర అని పేర్కొనడం దారుణమన్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. మహిళా రెజ్లర్లు చేస్తున్న పోరాటం దేశానికి అవమానం అనిపించడం లేదా అని ప్రశ్నించారు.
Also Read : బైజు ఉద్యోగులకు చీఫ్ భరోసా