Kavya Maran : హైదరాబాద్ గెలిచేనా ‘పాప’ నవ్వేనా
గాడిన పడని సన్ రైజర్స్ తో పరేషాన్
Kavya Maran SRH : ఐపీఎల్ 16వ సీజన్ ఆసక్తికర సన్నివేశాలకు వేదికగా మారింది. సినీ రంగానికి చెందిన నటులు హల్ చల్ చేస్తే అందరికంటే ఎక్కువగా ఆకర్షిస్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్, సిఇఓ కావ్య మారన్(Kavya Maran SRH). వేల కోట్ల సామ్రాజానికి ఏకైక వారసురాలిగా ఉంది ఈ అమ్మడు. విచిత్రం ఏమిటంటే ఏరికోరి ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను టేకోవర్ చేసుకుంది.
యాజమాన్య నిర్వహణలో ఆరి తీరిన కావ్య మారన్ కు హైదరాబాద్ జట్టు మింగుడు పడడం లేదు. ఎన్నో మార్పులు చేసింది. కోట్లాది రూపాయలు కుమ్మరించినా ఫలితం లేక పోయింది. గత సీజన్ లో తీవ్ర నిరాశకు గురి చేస్తే..ఈసారి ఐపీఎల్ మినీ వేలం పాటలో కావ్య మారన్ భారీ ధరకు ఆటగాళ్లను తీసుకుంది. అంతే కాదు జట్టుకు సంబంధించి కోచ్ లను కూడా మార్చింది. విండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారాను ఏరికోరి హెడ్ కోచ్ గా నియమించింది.
ఈ తరుణంలో తమ జట్టు ఆడిన ప్రతి మ్యాచ్ లో ప్రత్యక్షం అవుతుంది కావ్య మారన్(Kavya Maran). తన అందంతో, హావ భావాలతో నేషనల్ క్రష్ గా మారింది ఈ ముద్దుగుమ్మ. కోట్లాది మంది ఆమెకు ఫిదా అయ్యారు. తాజాగా హైదరాబాద్ కోల్ కతా నైట్ రైడర్స్ తో కీలక మ్యాచ్ ఉప్పల్ లో జరగనుంది. అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. తాము ఆరాధించే పాప కావ్య మారన్ పెదవులపై నవ్వు లేక పోవడంపై. ఈసారైనా హైదరాబాద్ గెలవాలని కావ్య నవ్వాలని కోరుకుంటున్నారు.
Also Read : హైదరాబాద్ మెరిసేనా కోల్ కతా గెలిచేనా