Arvind Kejriwal : రెజ్లర్లపై ఖాకీల దాష్టీకం కేజ్రీవాల్ ఆగ్రహం
నిరసన తెలిపితే దాడి చేస్తారా
Arvind Kejriwal : తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, వెంటనే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏప్రిల్ 23 నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు మహిళా రెజ్లర్లు. బుధవారం అర్ధరాత్రి ఖాకీలు దాడికి పాల్పడ్డారు. పలువురు రెజ్లర్లకు గాయాలయ్యాయి. ఒకరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఈ మొత్తం ఘటన దేశంలో సంచలనం కలిగించింది.
మహిళా రెజ్లర్లపై దాడికి పాల్పడడాన్ని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) తీవ్రంగా ఖండించారు. భారతీయ జనతా పార్టీకి పోయే కాలం వచ్చిందంటూ సంచలన కామెంట్స్ చేశారు. వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్ లు కన్నీటి పర్యంతం కావడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని నిలదీశారు. కేవలం రాచరిక పాలన సాగిస్తున్నారంటూ మండిపడ్డారు.
బీజేపీని ఈ దరిదాపుల్లో లేకుండా తరిమి కొట్టాలని అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. మహిళా రెజ్లర్లు తాము చేస్తున్న ఆందోళనకు రైతులు మద్దతు ఇవ్వాలని కోరారు. దీంతో ఖాకీలు రంగ ప్రవేశం చేశారు. దీక్షలో ఉన్న రెజ్లర్లపై దాడికి పాల్పడ్డారు. ఆపై వారిని ఇష్టానుసారం దుర్భాషలాడడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం.
తాము నేరస్థులం కామని, దేశానికి పతకాలు తీసుకు వచ్చిన అథ్లెట్లమని గుర్తు పెట్టుకోవాలని అన్నారు వినేష్ ఫోగట్. ఇలాంటి దాడుల కోసమా తాము పని చేసిందన్నారు. రక్షణ కల్పించాల్సిన వాళ్లు తమను చంపేందుకు వచ్చారంటూ ఆవేదన చెందారు రెజ్లర్లు.
Also Read : ఖాకీల తీరుపై డీసీడబ్ల్యూ చీఫ్ కన్నెర్ర