V Srinivas Goud : మీ బిడ్డ‌లైతే ఇలాగే చేస్తారా – శ్రీ‌నివాస్ గౌడ్

కేంద్ర స‌ర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహం

V Srinivas Goud : తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి విర‌స‌నోళ్ల శ్రీ‌నివాస్ గౌడ్(V Srinivas Goud)  నిప్పులు చెరిగారు. రెజ్లింగ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా చీఫ్‌, భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. త‌మ‌పై లైంగిక వేధంపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని, చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ గ‌త ఏప్రిల్ 23 నుంచి ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఆందోళ‌న చేప‌ట్టారు మ‌హిళా మ‌ల్ల‌యోధులు. వీరికి సంఘీభావం ప్ర‌క‌టించింది భార‌తీయ రాష్ట్ర స‌మితి.

ఈ సంద‌ర్భంగా ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అనంత‌రం ఎంపీలతో క‌లిసి క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సంద‌ర్శించారు. మ‌హిళా రెజ్ల‌ర్ల‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా వినేష్ ఫోగ‌ట్, సాక్షి మాలిక్, త‌దిత‌రుల‌తో మాట్లాడారు. త‌మ పార్టీ అండ‌గా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

అనంత‌రం విరస‌నోళ్ల శ్రీ‌నివాస్ గౌడ్ జాతీయ మీడియాతో మాట్లాడారు. కేంద్ర స‌ర్కార్ పై, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi), హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వాళ్లు ఏమైనా నేర‌స్థులా అని ప్ర‌శ్నించారు.

రాజ‌ధానిలో న్యాయం కోసం నిర‌స‌న దీక్ష చేప‌ట్టిన మ‌హిళా రెజ్ల‌ర్ల‌పై దాడి జ‌ర‌గ‌డం దారుణ‌మ‌న్నారు. మీ బిడ్డ‌లైతే ఇలాగే ప్ర‌వ‌ర్తిస్తారా అంటూ ప్ర‌శ్నించారు వి. శ్రీ‌నివాస్ గౌడ్. డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి డిమాండ్ చేశారు.

Also Read : ప‌ద‌వుల పందేరం ‘ప‌ల్లె’కు గౌర‌వం

Leave A Reply

Your Email Id will not be published!