Babar Azam : బాబ‌ర్ ఆజమ్ అరుదైన రికార్డ్

వ‌న్డేల్లో 18 సెంచ‌రీల‌తో 5 వేల ర‌న్స్

Babar Azam : స్టార్ క్రికెట‌ర్ , పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్(Babar Azam) దుమ్ము రేపాడు. అరుదైన రికార్డ్ న‌మోదు చేశాడు. వ‌న్డే క్రికెట్ లో కేవ‌లం 97 ఇన్నింగ్స్ మాత్ర‌మే ఆడిన ఆజ‌మ్ 18 సెంచ‌రీల‌తో స‌త్తా చాటాడు. స్వ‌దేశంలో కీవీస్ తో జ‌రిగిన వ‌న్డే సీరీస్ లో 4వ వ‌న్డే మ్యాచ్ లో సూప‌ర్ ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. అద్భుతంగా ఆడి శ‌త‌కం సాధించాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ, విండీస్ మాజీ స్టార్ క్రికెట‌ర్ వివియ‌న్ రిచ‌ర్డ్స్ సాధించిన రికార్డుల‌ను బ్రేక్ చేశాడు బాబ‌ర్ ఆజ‌మ్.

త‌న పేరు తో మ‌రో రెండు రికార్డులు న‌మోదు చేశాడు పాకిస్తాన్ జ‌ట్టు కెప్టెన్. 5 మ్యాచ్ ల వ‌న్డే సీరీస్ లో ఇప్ప‌టి దాకా పాకిస్తాన్ 3-0 తేడాతో సీరీస్ కైవ‌సం చేసుకుంది. వ‌రుస‌గా 49, 65, 54 ర‌న్స్ చేశాడు. నాలుగో వ‌న్డేలో 113 బంతుల్లో శ‌త‌కం పూర్తి చేశాడు. మొత్తం 117 బాల్స్ ఎదుర్కొని 10 ఫోర్లు కొట్టాడు. 107 ర‌న్స్ చేశాడు.

ఇక త‌న ఇన్నింగ్స్ లో భాగంగా 19 ర‌న్స్ పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా త‌న వ‌న్డే కెరీర్ లో 5,000 ర‌న్స్ పూర్తి చేశాడు. అరుదైన రికార్డు న‌మోదు చేశాడు. అంత‌కు ముందు 101 ఇన్నింగ్స్ ల‌లో ద‌క్షిణాఫ్రికా క్రికెట‌ర్ హ‌షీమ్ ఆమ్లా 5 వేల ప‌రుగులు చేశాడు. విరాట్ కోహ్లీ(Virat Kohli) 114 ఇన్సింగ్స్ ల‌లో 5 వేలు సాధించాడు.

Also Read : కేఎల్ ప్లేస్ లో ఛాన్స్ ఎవ‌రికో

Leave A Reply

Your Email Id will not be published!