Aditi Tiwari : ఆదితి తివారీ అరుదైన ఘనత
భారీ ప్యాకేజీతో మైక్రోసాఫ్ట్ లో ఆఫర్
Aditi Tiwari : యావత్ ప్రపంచం ఆర్థిక మాంద్యం పేరుతో వేలాది మందిని ఇంటికి పంపిస్తున్న ఈ తరుణంలో భారత దేశానికి చెందిన ఆదితి తివారీ అరుదైన ఘనతను సాధించింది. ఏకంగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీలో భారీ ప్యాకేజీతో జాబ్ కొట్టేసింది. ఐఐటీ, ఐఐఎం నుండి ఎంపిక కాలేదు. ఎన్ఐటీ పాట్నాలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫైనల్ ఇయర్ చదువుతోంది ఆదితి తివారి(Aditi Tiwari). గతంలో ఉన్న రికార్డ్ ను బద్దలు కొట్టారు. మిగతా తోటి విద్యార్థులను విస్తు పోయేలా చేశారు.
ఫేస్ బుక్ ఆదితి తివారీకి రికార్డు స్థాయిలో భారీ ప్యాకేజీతో ఆఫర్ ఇచ్చింది. ఇదిలా ఉండగా భారత దేశంలో ఐఐటీలు, ఐఐఎంల నుండి విద్యార్థులు తమ చదువు పూర్తి చేశాక భారీ ప్యాకేజీలను అందుకోవడం సర్వ సాధారణం. కోట్లల్లో వారి వేతనాలు ఉంటాయి. కానీ 2022లో ఎన్ఐటీ పాట్నా లో నిర్వహించిన ప్లేస్ మెంట్లలో అత్యధికంగా రూ. 1.6 కోట్ల ప్యాకేజీని దక్కించుకుంది ఆదితీ తివారీ.
తండ్రి టాటా స్టీల్ లో ఉద్యోగిగా పని చేస్తుండగా తల్లి ప్రభుత్వ బడిలో టీచర్. ఇదిలా ఉండగా ఆదితీ తివారీని ఫ్రంట్ ఇంజనీర్ గా రిక్రూట్ చేసింది మైక్రోసాఫ్ట్ కంపెనీ. రూ. 1.6 కోట్ల ప్యాకేజీని నమోదు చేయడంతో వార్తల్లో నిలిచింది. మరో వైపు ఎన్ఐటీ పాట్నా 2022లో 110 శాతం మొత్తం ప్లేస్ మెంట్లతో రికార్డు సృష్టించింది.
Also Read : Siddaramaiah CM