Sharath Babu : నటుడు శరత్ బాబు ఇక లేరు
నిన్న సంగీత దర్శకు రాజ్ మృతి
Sharath Babu : విలక్షణ నటుడిగా పేరు పొందిన శరత్ బాబు(Sharath Babu) సోమవారం కన్ను మూశారు. తెలుగు చిత్ర సీమలో విషాదం అలుముకుంది ఆయన మరణ వార్త విని. నిన్న ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో కోలుకోలేని సినీ రంగం ఉన్నట్టుండి శరత్ బాబు లేరని తలుచుకుని కన్నీటి పర్యంతం అవుతోంది.
కిడ్నీస్ ఫెయిల్ కావడం, బ్లడ్ ఇన్ఫెక్షన్ తలెత్తడంతో చెన్నై నుంచి హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. వెంటి లేటర్ పై శరత్ బాబుకు(Sharath Babu) చికిత్స అందిస్తూ వచ్చారు. మరిచి పోలేని సినిమాలను ఆయన చేశారు. దాదాపు 300కి పైగా చిత్రాలలో నటించారు. తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర కనబర్చారు. శరత్ బాబు మరణ వార్తతో టాలీవుడ్ కు చెందిన ప్రముఖులంతా చేరుకున్నారు. తమ ప్రగాఢ సానుభూతిని తెలియ చేశారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. శరత్ బాబు చిరునవ్వు కలకాలం గుర్తుండి పోతుందన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఏపీ బీజేపీ చీఫ్ సోమూ వీర్రాజు కోరారు. శరత్ బాబు మృతి పట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. శరత్ బాబు ఇక లేరన్న వార్తను మేం జీర్ణించుకోలేక పోతున్నామని అన్నారు నటుడు మురళీ మోహన్. 2 గంటల పాటు చాంబర్ లో ఉంచుతారు. ఆ తర్వాత చెన్నైకి శరత్ బాబు పార్థివ దేహాన్ని తరలించనున్నారు.
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. తెలుగు సినిమా రంగానికి తీరని లోటు అన్నారు పోసాని కృష్ణ మురళి.
Also Read : Wrestlers Protest