Byjus Case : ప్రముఖ ఎడ్యుకేషన్ కంటెంట్ సంస్థ బైజూస్ $1.2 బిలియన్లకు పైగా రుణ చెల్లింపునకు సంబంధించి రెడ్ వుడ్ సంస్థపై కేసు వేసింది. టర్మ్ లోన్ నిబంధనల ప్రకారం క్లిష్టమైన హక్కులతో పెట్టుబడి సంస్థను రుణదాతగా అనర్హులుగా పేర్కొంటూ రెడ్ వుడ్ సంస్థలకు బైజూస్(Byjus) నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని బైజూస్ కీలక ప్రకటన చేసింది.
రెడ్ వుడ్ రుణంలో గణనీయమైన భాగాన్ని కొనుగోలు చేసిందని , ప్రాథమికంగా ఒత్తిడిలో ఉన్న రుణంలో వ్యాపారం చేస్తోందంటూ ఆరోపించింది. ఇది ప్రత్యేకంగా రూల్స్ కు విరుద్దమని పేర్కొంది కోర్టులో వేసి దావాలో బైజూస్(Byjus).
రెడ్ వుడ్ నేతృత్వంలోని రుణ దాతల వరుస దోపిడీ వ్యూహాలను అనుసరించి తాము ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది సంస్థ. మార్చిలో రుణ దాతలు కొన్ని ద్రవ్యేతర , సాంకేతిక డిఫాల్ట్ ల కారణంగా చట్ట విరుద్దంగా రుణాన్ని వేగవంతం చేశారని తెలిపింది.
రుణదాతలు ప్రత్యేకించి అమెరికా లోని బైజూస్ యూనిట్ ఆల్ఫాపై నియంత్రణను స్వాధీనం చేసుకునేందుకు యత్నించారంటూ ఆరోపించింది కంపెనీ. అనవసరమైన అమలు చర్యలు చేపట్టారంటూ బైజూస్ ఆరోపించింది. కాగా ప్రస్తుత వివాదాన్ని కోర్టు పరిష్కరించేంత వరకు ఎలాంటి వడ్డీతో సహా బి – లోన్ ప్రొవైడర్లకు తదుపరి చెల్లింపు చేయకూడదని ఎంచుకున్నట్లు కంపెనీ పేర్కొంది.
Also Read : NK Venkatesan Comment : మృత్యుంజయుడు ఆపద్బాంధవుడు
