Nikhil Kamath Donate : ఈ దానవుడు భారతీయుడు
గివింగ్ ప్లెడ్జ్ కు సగం సంపద
Nikhil Kamath Donate : ఏమిటీ గివింగ్ ప్లెడ్జ్ అనుకుంటున్నారా. ఇదో దాతృత్వపు సంస్థ. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్ గురువుగా పేరు పొందిన టాప్ బిలియనీర్ బిల్ గేట్స్ స్థాపించిన సంస్థ. కుబేరులైన వారిలో చాలా మంది తాము పోగేసుకున్న డబ్బుల లోంచి సగానికి పైగా దాన ధర్మాలకు, దాతృత్వపు సంస్థలకు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఇప్పటికే ఇన్ఫోసిస్, విప్రో , టాటా, రిలయన్స్ , ఇలా టాప్ కంపెనీలన్నీ ప్రతి ఏటా సంపాదించిన దాంట్లోంచి కొంత మొత్తాన్ని విరాళంగా ఇస్తూ వస్తున్నారు. కానీ భారత దేశానికి చెందిన అత్యంత పిన్న వయస్సు కలిగిన నిఖిల్ కామత్(Nikhil Kamath) వార్తల్లో నిలిచాడు. ఈ భారతీయుడు తను నిజమైన దానవుడని నిరూపించుకున్నాడు.
ఏకంగా పది తరాలకు సరిపడా కోట్లాది రూపాయలు సంపాదించిన ఈ యువ వ్యాపారవేత్త తాను సాధించిన దాంట్లోంచి 50 శాతం డబ్బులను వారెన్ బఫెట్ గివింగ్ ప్లెడ్జ్ కు ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. 143 కోట్ల మంది భారతీయులు విస్తు పోయారు నిఖిల్ కామత్ చేసిన ప్రకటన చూసి. కోట్లు ఉన్నా కనికరం లేని బడా బాబులు ఎంతో ఉంది ఉన్నారు. ఆర్థిక నేరగాళ్లు లూటీ చేసి దేశం దాటిన వాళ్లు ఉన్నారు. కానీ అందరికంటే జీవితానికి పరమార్థం సాయం చేయడమేనని నమ్మాడు ఈ యువ బిజినెస్ మెన్ నిఖిల్ కామత్(Nikhil Kamath). ఆయన తీసుకున్న నిర్ణయానికి పలువురు ఫిదా అవుతున్నారు. కామత్ జెరోధా సంస్థను స్థాపించాడు. ఇది స్టాక్ మార్కెట్ లో పనిచేస్తుంది.
ఇక ఇప్పటి దాకా విరాళాలు ప్రకటించిన భారతీయ వ్యాపారవేత్తలలో అజీమ్ ప్రేమ్ జీ, కరిణ్ మజుందార్ షా, రోహిణి, నందన్ నీలేకని తో పాటు నిఖిల్ కామత్ ఉన్నారు. ఇదిలా ఉండగా $3.45 బిలియన్ల నికర విలువను కలిగి ఉన్నాడు నిఖిల్ కామత్. విద్య, ఆరోగ్యం కోసం విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు కామత్. నిఖిల్ తన సోదరుడు నితిన్ కామత్ తో కలిసి గత ఏడాది 2022లో ఏకంగా విరాళంగా రూ. 100 కోట్ల వ్యక్తిగత సంపదను విరాళంగా ఇచ్చారు. నిఖిల్ కామత్ స్వస్థలం కర్ణాటక. మధ్య తరగతిలో పుట్టి మధ్యలోనే బడి మానేసిన ఈ కుర్రాడు ఇవాళ టాప్ బిలీయనీర్ కావడం విశేషం. ఒకప్పుడు డ్రాపౌట్ ఇప్పుడు కోట్లకు అధిపతి. కాలం చేసిన సంతకం అతడి విజయం. మరి మీరేమంటారు.
Also Read : Raghunath Goli Soda Comment : ‘గోలీ సోడా’ గెలుపు కథ