JDS BJP Alliance : బీజేపీతో దోస్తీకి జేడీఎస్ రెడీ
సంకేతాలు పంపిన పార్టీ చీఫ్
JDS BJP Alliance : కర్ణాటకలో రాజకీయాలు మారి పోయాయి. ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆక్సిజన్ కరువైన కాంగ్రెస్ పార్టీ ఊహించని రీతిలో పవర్ లోకి వచ్చింది. ఏ పార్టీపై ఆధార పడకుండానే భారీ మెజారిటీతో ఒంటరిగానే అధికారాన్ని ఏర్పాటు చేసింది. ఈ తరుణంలో ఎక్కువ స్థానాలు సంపాదించి చక్రం తిప్పాలని భావించింది మాజీ ప్రధాన మంత్రి , హెచ్ డీ దేవె గౌడ సారథ్యంలోని జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్). కానీ ఆ పార్టీకి కేవలం 19 సీట్లకే పరిమితమైంది. బీజేపీకి 65 సీట్లతో సరి పెట్టుకుంటే కాంగ్రెస్ 135 సీట్లను కైవసం చేసుకుంది. ఆ పార్టీ ఇప్పుడు రాబోయే లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది.
ప్రస్తుతం రాష్ట్రం నుంచి 28 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో ఒక స్థానం మాత్రమే జేడీఎస్(JDS) దక్కించుకుంది. ఇదిలా ఉండగా 2006లో జేడీఎస్ , బీజేపీతో కలిసి సంకీర్ణ సర్కార్ ఏర్పాటు చేశాయి. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు ఆ పార్టీ చీఫ్ దేవె గౌడ. ఈ మేరకు ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ విపక్షాలన్నీ రైల్వే శాఖ మంత్రిపై దుమ్మెత్తి పోస్తుంటే కష్ట పడుతున్నాడంటూ కితాబు ఇచ్చారు.
ఇదే క్రమంలో గత నెల 28న అన్ని పక్షాలు నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాయి. కానీ జేడీఎస్(JDS) ఓకే చెప్పింది. గతంలో 20 నెలల పాటు బీజేపీ, జేడీఎస్ కలిసి పని చేశాయి. దేవె గౌడ తనయుడు కుమార స్వామి సీఎంగా , డిప్యూటీ సీఎంగా యడ్యూరప్ప ఉన్నారు. కానీ అధికారాన్ని బదిలీ చేయక పోవడంతో సర్కార్ కూలింది. ఆ తర్వాత ఇద్దరికీ చెడింది. ప్రస్తుతం మరోసారి పాత మిత్రులు కలుసుకునేందుకు ప్లాన్ చేస్తుండడం విశేషం.
మరో వైపు దేవె గౌడ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గత కొన్నేళ్లుగా రాజకీయాలను గమనిస్తున్నానని విపక్షాలు కలయిక వల్ల ఎలాంటి ఉపయోగం లేదని గమనించినట్లు స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే జేడీఎస్, బీజేపీ పొత్తు కుదరడం ఖాయమని తేలి పోయింది.
Also Read : Om Raut Kiss Kriti Sanan : శ్రీవారి సాక్షిగా కృతికి ఓం రౌత్ కిస్