Delhi Police WFI Chief : డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ ఇంటికి రెజ్లర్
మహిళా కానిస్టేబుళ్లతో విచారణ
Delhi Police WFI Chief : తమను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడంటూ మహిళా రెజ్లర్లు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. తాను సచ్చీలుడినని పేర్కొన్నారు ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(WFI Chief) . ఆయనపై కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. కోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉంది. ఇప్పటికే రెజ్లర్లు అమిత్ షాతో చర్చించారు.
అనంతరం క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆహ్వానం మేరకు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ భేటీ అయ్యారు. అనంతరం 15 వరకు గడువు విధిస్తున్నట్లు తెలిపారు. ఈ తరుణంలో రైతు సంఘాల నేతలు బేషరతుగా మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఎంత త్వరగా విచారణ జరిపితే అంత మంచిదన్నారు బీకేయూ జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్.
ఇక సింగ్ పై కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గతంలో నమోదైన రెండు కేసులలో ఒకటి మహిళా రెజ్లర్లది కాగా మరో కేసు పోక్సో కేసు. విచారణ జరుగుతుండగా మైనర్ బాలిక తండ్రి కోర్టుకు విన్నవించారు తన కూతురు మైనర్ కాదు మేజర్ అని.
తాజాగా ఢిల్లీ పోలీసులు తీవ్ర ఆరోపణలు చేసిన సంగీతా ఫోగట్ ను మహిళా కానిస్టేబుళ్ల సంరక్షణలో ఢిల్లీలోని డబ్లుఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఇంటికి తీసుకు వెళ్లారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా వెల్లడించింది. త్వరలోనే నివేదిక సమర్పించాల్సి ఉంది ఢిల్లీ పోలీస్.
Also Read : Google Shock : గూగుల్ నిర్ణయం ఉద్యోగులు ఆగ్రహం