Vetrimaaran Viral : దిగ్గ‌జ ద‌ర్శ‌కుల అపురూప క‌ల‌యిక‌

వెట్రి మార‌న్..లోకేష్ క‌న‌క‌రాజ్..కార్తీక్ సుబ్బరాజు

Vetrimaaran Viral : త‌మిళ సినిమా ఇండ‌స్ట్రీలో ఆ ముగ్గురు అద్భుత‌మైన ద‌ర్శ‌కులు. త‌మ ప్ర‌తిభావంత‌మైన ద‌ర్శ‌క‌త్వ నైపుణ్యంతో పేరు పొందారు. ఒక‌రిని మించి మ‌రొక‌రు కోలీవుడ్ పై చెర‌గ‌ని సంత‌కం చేశారు. ఒక్కో ద‌ర్శ‌కుడిది ఒక్కో నేప‌థ్యం. కానీ వారి మ‌ధ్య స్నేహం మాత్రం ప‌దిలం. ఆ ముగ్గురు దిగ్గ‌జ ద‌ర్శ‌కులు ఎవ‌రో కాదు ఒక‌రు వెట్రి మార‌న్(Vetrimaaran) మ‌రొక‌రు కార్తీక్ సుబ్బ‌రాజు..లోకేష్ క‌న‌క‌రాజ్.

అద్బుత‌మైన చిత్రాల‌ను తీస్తూ సినీ ప్రేక్ష‌కుల‌ను ఆలోచింప చేయ‌డంలో ఒక‌రు స‌క్సెస్ అయితే మ‌రొక‌రు మాత్రం భిన్న‌మైన స‌బ్జెక్టుల‌తో సినిమాలు తీస్తూ దుమ్ము రేపుతున్నారు. ఈ ముగ్గురు క‌లుసుకున్నారు. త‌మ ఆలోచ‌నల‌ను పంచుకున్నారు. ఈ అరుదైన దృశ్యానికి సంబంధించిన ఫోటోల‌ను స్వ‌యంగా షేర్ చేశాడు ద‌ర్శ‌కుడు వెట్రి మార‌న్. త‌న స‌హ‌చ‌ర ద‌ర్శ‌కుల‌తో పాటు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తో క‌లిసి కూడా ఫోటో దిగాడు.

ఇదిలా ఉండ‌గా వెట్రి మార‌న్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. త‌మిళ సినిమా రంగంలో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న ఘ‌న‌త ఈ ద‌ర్శ‌కుడిది. చిత్ర నిర్మాత‌, స్కీన్ రైట‌ర్ గా ఉన్నాడు. 2021 నాటికి ఏకంగా ఐదు జాతీయ స్థాయిలో ఉత్త‌మ చ‌ల‌న‌చిత్ర అవార్డుల‌ను స్వంతం చేసుకున్నాడు. ఎనిమిది ఆనంద విక‌ట‌న్ సినిమా అవార్డులు, రెండు ఫిల్మ్ ఫేర్ సౌత్ పుర‌స్కారాల‌ను అందుకున్నారు.

Also Read : Priyank Kharge : బొకేలు వ‌ద్దు పుస్త‌కాలు ఇవ్వండి – ఖ‌ర్గే

 

Leave A Reply

Your Email Id will not be published!