Ram Charan Upasana : కొత్త జంటకు చెర్రీ..ఉపాసన విషెస్
వరుణ్ తేజ్ ..లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం
Ram Charan Upasana : త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జంట వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠిలు శనివారం నాగబాబు నివాసంలో నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి వేడుకలు ఘనంగా జరిగాయి. మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్(Ram Charan) , ఉపాసన కొత్త జంటను అభినందించారు. భవిష్యత్తు అంతా బాగుండాలని కోరుకున్నారు. ఇదిలా ఉండగా వరణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి గత ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నారు.
ఆపై చెటా పట్టాల్ వేసుకుని తిరిగారు. లోకమంతా వీరి ప్రేమాయణం గురించి చెప్పుకుంది. ఇక సోషల్ మీడియాలో వీరు త్వరలోనే ఒక్కటి కాబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఇటీవలే పారిస్ కు వెళుతూ వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి కెమెరా కళ్లకు చిక్కారు. చివరకు తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.
ఈసందర్భంగా సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఈ జంటను అభినందించారు. ప్రత్యేకించి మెగా ఫ్యామిలీకి చెందిన కుటుంబీకులు, అత్యంత సన్నిహితులు విచ్చేశారు. తమ ఇంట జరుగుతున్న వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ , అల్లు అరవింద్ , సురేఖ హాజరయ్యారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త జంటను ఆశీర్వదించారు.
ఇదిలా ఉండగా వరణ్ తేజ్ , లావణ్య కలిసి అంతరిక్షం సినిమాలో నటించారు. ఇక వరుణ్ తేజ్ నటించిన ఫిదా, ఎఫ్-2 బిగ్ సక్సెస్ గా నిలిచాయి. మొత్తంగా మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు త్వరలో మోగనున్నాయి.
Also Read : India Emerges : ఇంటర్నెట్ వినియోగంలో భారత్ టాప్