Sapthagiri Balakrishna : బాల‌య్య‌ను చూస్తే పూన‌కాలే – స‌ప్త‌గిరి

క‌మెడియ‌న్ ఫోటో నెట్టింట్లో వైర‌ల్

Sapthagiri Balakrishna : త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న అరుదైన న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఆయ‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అంతే కాదు అన్ని రంగాల‌కు చెందిన వారంతా బాల‌య్య న‌ట‌నకు ఫిదా అయిన వాళ్లే. ప్ర‌త్యేకించి సినిమా రంగంలో ఉన్న న‌టీ న‌టులు ఆయ‌న‌ను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందంటున్నారు. పుట్టిన రోజు సంద‌ర్భంగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తీసిన భ‌గ‌వంత్ కేసరి సినిమా టీజ‌ర్ రిలీజ్ చేశారు. దీనికి అద్భుత‌మైన సంగీతం అందించారు ఎస్ఎస్ థ‌మ‌న్.

తాజాగా ప్ర‌ముఖ కమెడియ‌న్ స‌ప్త‌గిరి నంద‌మూరి బాల‌కృష్ణ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న‌తో క‌లిసి ఉన్న అరుదైన ఫోటోను ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆదివారం పంచుకున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో వైర‌ల్ గా మారింది. అటు వెండి తెర పైనే కాకుండా ఇటు బుల్లి తెర‌పై కూడా బాల‌య్య బాబు దుమ్ము రేపుతున్నాడ‌ని ఆయ‌న‌తో క‌లిసి న‌టించ‌డం త‌న పూర్వ జ‌న్మ సుకృత‌మ‌ని పేర్కొన్నాడు న‌టుడు స‌ప్త‌గిరి(Sapthagiri).

త‌న జీవితంలో ఒక్క‌సారైనా బాల‌కృష్ణ‌ను చూడాల‌ని అనుకున్నాన‌ని, కానీ ఆ దేవ దేవుడు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి క‌రుణ క‌టాక్షం మేర‌కు ఏకంగా అద్భుత న‌టుడితో న‌టించే ఛాన్స్ ఇచ్చాడ‌ని గుర్తు చేసుకున్నారు. ఏది ఏమైనా బాల‌య్య‌ను చూస్తే పోయిన ఎన‌ర్జీ తిరిగి వ‌స్తుంద‌న్నాడు. అంతే కాదు పూన‌కాలు కూడా వ‌స్తాయ‌ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడు క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి.

Also Read : Barry O’Farrell AO : త‌లైవాతో ఆస్ట్రేలియా క‌మీష‌న‌ర్ భేటీ

Leave A Reply

Your Email Id will not be published!