CM Siddaramaiah : చీఫ్ సెక్రటరీకి సీఎం ఉచిత టికెట్
శక్తి స్కీం యోజన ప్రారంభించిన సిద్దరామయ్య
CM Siddaramaiah : కర్ణాటకలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ బస్సులలో ఉచితంగా మహిళలు, విద్యార్థులకు ప్రయాణం అందజేసేందుకు గాను ఉద్దేశించిన శక్తి స్కీం ను ఆదివారం ప్రారంభించారు సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.
ఇందులో భాగంగా మొదటి ఉచిత ప్రయాణ టికెట్ ను బస్సులో కర్ణాటక చీఫ్ సెక్రటరీ వందిత శర్మకు అందజేశారు సీఎం సిద్దరామయ్య(Siddaramaiah). ఇదిలా ఉండగా కొన్ని టికెట్లను సీఎం, డిప్యూటీ సీఎం కొన్ని డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారు. సీఎస్ కు టికెట్ ఇచ్చిన అనంతరం సీఎం సిద్దరామయ్య మాట్లాడారు. తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
ఎన్నికల సందర్బంగా 5 గ్యారెంటీ హామీలను ప్రకటించింది. తాజాగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో 224 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 135 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ 65 సీట్లకే పరిమితమైంది. జేడీఎస్ 19 సీట్లతో సరి పెట్టుకుంది. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని ప్రకటించారు సీఎం. పీజీలు చేసి నిరుద్యోగులుగా ఉన్న వారికి రూ. 3000 , డిప్లొమా హోల్డర్లకు రూ. 1,500 ఇస్తున్నట్లు తెలిపారు.
తమ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం కట్టుబడి ఉందన్నారు. ఇందులో భాగంగా ఉచితంగా బస్సుల్లో ప్రయాణం ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. అవినీతి రహిత పాలన తమ ఉద్దేశమన్నారు సీఎం సిద్దరామయ్య.
Also Read : RS Praveen Kumar : తప్పుడు పత్రాలతో భూముల కబ్జా – ఆర్ఎస్పీ