Smitha Sabharwal : నా తండ్రి నాకు రోల్ మోడల్
స్మిత సబర్వాల్ ఫాదర్స్ డే
Smitha Sabharwal : ఫాదర్స్ డే సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్. ఆమె సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. ఎప్పటికప్పుడు విశేషాలను పంచుకుంటారు. పూర్తి పాజిటివ్ దృక్ఫథాన్ని కలిగి ఉండే స్మితా సబర్వాల్ పుస్తకాలను బాగా చదువుతారు. ప్రజలతో ఎక్కువగా కలిసి ఉండాలని కోరుకుంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో స్మితా సబర్వాల్ కలెక్టర్ గా విధులు నిర్వహించారు. ఒకానొక సమయంలో అమర వీరుల తల్లులతో కలిసి కన్నీటి పర్యంతం అయ్యారు.
ప్రస్తుతం సీఎంఓలో ఉన్నారు స్మితా సబర్వాల్ . ప్రతి ఏటా జూన్ 18న తండ్రుల దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా జన్మను ఇచ్చిన తన తండ్రి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు స్మితా సబర్వాల్. ఇది నా ఒక్కరికే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న ఆడపిల్లలను కలిగి ఉన్న తండ్రులకు, తమకు జన్మనిచ్చినందుకు, ఈ ప్రత్యేకమైన, అరుదైన లోకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని తెలిపారు స్మితా సబర్వాల్(Smitha Sabharwal).
మన తండ్రులు మన జీవితాల్లోకి తీసుకు వచ్చిన అచంచలమైన ప్రేమ, మార్గదర్శకత్వం , అంకిత భావాన్ని తాము గౌరవిస్తామని స్పష్టం చేశారు. మా సూపర్ హీరోలు, రోల్ మోడల్ లు, అతి పెద్ద మద్దతుదారులు మీరేనంటూ పేర్కొన్నారు స్మితా సబర్వాల్.
Also Read : Bhagwant Mann : సీఎం కావడాన్ని తట్టుకోలేక పోయారు