YS Sharmila : నువ్వు లేవు నీ జ్ఞాపకం మిగిలే ఉంది
నాకు స్పూర్తి నా తండ్రి వైఎస్సార్
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల భావోద్వేగానికి లోనయ్యారు. జూన్ 18 ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచానికి పరిచయం చేసిన ఎందరో తండ్రులకు ధన్యవాదాలు తెలియ చేస్తున్నానని పేర్కొన్నారు వైఎస్ షర్మిల. ఆమె తండ్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి సీఎంగా పని చేశారు. సంక్షేమ పథకాల పేరుతో చరిత్రను సృష్టించారు.
కానీ అనుకోని రీతిలో నల్లమల్ల అడవుల్లో ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ కూలి పోవడంతో లోకాన్ని వీడారు. ఈ సందర్బంగా తన తండ్రి ఇవాళ తమ మధ్య లేక పోవడాన్ని గుర్తు చేసుకున్నారు వైఎస్ షర్మిల(YS Sharmila). ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. తన తండ్రిని ఆమె పాపా అని ఆప్యాయంగా పిలుచుకుంటారు.
తన తండ్రితో తాను దిగిన అరుదైన ఫోటోను పంచుకున్నారు ట్విట్టర్ వేదికగా. ఈ సందర్బంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాన్నా నువ్వు లేవు..కానీ నీ జ్ఞాపకం పది కాలాల పాటు ఎల్లప్పటికీ నిలిచే ఉంటుందని పేర్కొన్నారు వైఎస్ షర్మిల. తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులలో తండ్రి పాత్ర ఎంతో కీలకమైనదిగా ఉంటుందని, ఎక్కువగా తండ్రితో బిడ్డకు చనువు ఉంటుందని గుర్తు చేశారు. పాపా ధన్యవాదాలు..మీరు నాపై కురిపించిన అచంచలమైన, షరతులు లేని ప్రేమకు నేను సర్వదా రుణపడి ఉంటానని అన్నారు. మీరు తప్పి పోలేదు..కానీ మాలోనే ఉన్నారని వాపోయారు.
Also Read : Smitha Sabharwal : నా తండ్రి నాకు రోల్ మోడల్